అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం
విజయదశమి పండుగ రోజు నిర్మాత శ్రీమతి అనురాధ గారి సమర్పణలో అభిరామ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమయ్యింది . ఈ సినిమాకు హీరో అభిరామ్ నన్ను ఆహ్వానించి నాతో కెమెరా స్విచ్ ఆన్ చేయించారు.
ఈ సినిమా కు సంబందించిన వార్త , మీ కోసం .
* * * *
అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం
శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి చిత్రం షూటింగ్ విజయదశమి రోజు
హైద్రాబాద్ లో నిరాడంబరంగా ప్రారంభమయ్యింది .
గురువారం ఉదయం 10. 20 నిమిషాలకు ఫిలింనగర్ లోని సంస్థ కార్యాలయంలో దేవుడి పై తీసిన ముహూర్తపు షాట్ కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా , హీరో అభిరామ్ క్లాప్ ఇచ్చారు , సినిమా స్క్రిప్టును సమర్పకురాలు ఎన్ .ఆర్ .అనురాధాదేవి అందించారు .
పూజ కార్యక్రమాన్ని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు నిర్వహించారు .ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దీపావళి తరువాత మొదలవుతుందని నిర్మాత అభిరామ్ రెడ్డి దాసరి చెప్పారు .
ఈ సినిమా లవ్ , థ్రిల్లర్ గా రూపొందుతుందని , ఈ తరానికి నచ్చే కథ తో నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగతా నటీనటులను ఎంపిక చేస్తామని చెప్పారు .
ఈ చిత్రానికి కథ , మాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : అభిరామ్ రెడ్డి దాసరి , ఛాయాగ్రహణం : విజయ భాస్కర్ సద్దాల , సహ దర్శకుడు : సాయి , సంగీతం : మంత్ర ఆనంద్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నారాయణ రాజు ఎస్. బి, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు , నిర్మాత : అభిరామ్ రెడ్డి దాసరి .
ఇంకా పేరు నిర్ణయించని ఈ ప్రేమ కథా చిత్రాన్ని సీనియర్ నిర్మాత శ్రీమతి అనురాధా దేవి సమర్పిస్తున్నారు .
Comments
Post a Comment