ఈరోజు నిర్మాత దర్శకుడు కె .బి .తిలక్ శత జయంతి . తెలుగు సినిమా రంగంలో కె .బి .తిలక్ ది . ఓ విభిన్నమైన , విలక్షణమైన శైలి . నిర్మాతగా , దర్శకుడుగా ఆయన నిర్మించినవి తక్కువ సినిమాలే కానీ అన్నీ ఆణిముత్యాలే . కె .బి .తిలక్ పూర్తి పేరు కొల్లిపర బాల గంగాధర తిలక్ . తిలక్ తండ్రి వేంకటాద్రి , స్వాతంత్య్ర ససమర యోధుడు . ఆయనపై జాతీయోద్యమ నాయకుడు బాల గాంధార తిలక్ ప్రభావం వుంది . 1926 జనవరి 14న జన్మించిన తన కుమారునికి బాల గంగాధర తిలక్ అని పేరు పెట్టారు . పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు గ్రామంలో అక్కినేని శ్రీరాములు గారికి ఐదుగురు అబ్బాయిలు , ఒక అమ్మాయి . ఆ ఐదుగురిలో ఇద్దరు ఎల్ .వి . ప్రసాద్, మరొకరు అక్కినేని సంజీవి , ఆ అమ్మాయి పేరు సుబ్బమ్మ . ఈ సుబ్బమ్మే వెంకటాద్రి గారి భార్య , కె .బి .తిలక్ గారి అమ్మ , అంటే తిలక్ మేన మామలు ఎల్ .వి . ప్రసాద్, అక్కినేని సంజీవి. తిలక్ మీద స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావం వుంది . 16 ఏళ్ళ వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు . చదువు మీద అంత ఆసక్తి లేదు . తన మేన మామ ఎల్ .వి ప్రసాద...