ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సంక్రాతి 

ఈ సంవత్సరం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సంక్రాతి పండుగ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి . 

చిన బాబు , ఉమామహేశ్వర రావు తో కలసి కల్చరల్ సెంటర్ కు వెళ్ళాను . 

ముఖ ద్వారము అంతా పూలతో అలంకరించారు . 

కనుమ సందర్భంగా ఏర్పాట్లు బాగా చేశారు . ఎన్ .టి .ఆర్ .   లాన్  గంగి రెద్దులు, హరిదాసు ఉన్నారు . గంగిరెద్దులతో సభ్యులు ఫోటోలు 


తీయించుకుంటున్నారు. పైన ఏ .ఎన్ .ఆర్ . లాన్ లో ఉత్సాహవంతులైన యువకులు గాలిపటాలను ఎగురవేస్తున్నారు . 

వచ్చినవారికి సంక్రాతి శుభాకాంక్షలు చెబుతూ ఉత్సాహంగా తిరుగుతున్నారు కార్యదర్శి తుమ్మల రంగా రావు గారు . 

నన్ను చూడగానే పలుకరించి 'గంగిరెద్దుల దగ్గర నిలబడండి ' అంటూ అక్కడకు తీసుకెళ్లి నిలబెట్టాడు భవాని . అలా తీసింది మీరు చూస్తున్న ఫోటో . 


తరువాత రంగారావు గారు 'మా ఇద్దరినీ కూడా తీయండి ' అని మరో ఫోటో తీయించారు . 

ఒక అరగంట కబుర్లు చెప్పుకున్న తరువాత మకర సంక్రాతి పండుగ స్పెషల్ లంచ్ కు వెళ్ళాము . 

Comments

Popular posts from this blog