ఈరోజు నిర్మాత దర్శకుడు కె .బి .తిలక్ శత జయంతి . 

తెలుగు సినిమా రంగంలో కె .బి .తిలక్ ది . ఓ విభిన్నమైన , విలక్షణమైన శైలి . 

నిర్మాతగా , దర్శకుడుగా ఆయన నిర్మించినవి తక్కువ సినిమాలే కానీ అన్నీ ఆణిముత్యాలే . 

కె .బి .తిలక్ పూర్తి పేరు కొల్లిపర బాల గంగాధర తిలక్ . 

తిలక్ తండ్రి వేంకటాద్రి , స్వాతంత్య్ర ససమర  యోధుడు . ఆయనపై జాతీయోద్యమ నాయకుడు బాల గాంధార తిలక్ ప్రభావం వుంది . 

1926 జనవరి 14న జన్మించిన తన కుమారునికి బాల  గంగాధర తిలక్ అని పేరు పెట్టారు . 

పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు గ్రామంలో అక్కినేని శ్రీరాములు గారికి ఐదుగురు అబ్బాయిలు , ఒక అమ్మాయి . ఆ ఐదుగురిలో ఇద్దరు ఎల్ .వి . ప్రసాద్, మరొకరు అక్కినేని సంజీవి , ఆ అమ్మాయి పేరు సుబ్బమ్మ . ఈ సుబ్బమ్మే వెంకటాద్రి గారి భార్య , కె .బి .తిలక్ గారి అమ్మ ,  అంటే తిలక్ మేన మామలు ఎల్ .వి . ప్రసాద్, అక్కినేని సంజీవి. 



తిలక్ మీద స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావం వుంది . 16 ఏళ్ళ వయసులో  క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించాడు . చదువు మీద అంత ఆసక్తి లేదు . తన మేన మామ ఎల్ .వి ప్రసాద్ ముంబైలో ఉంటే అక్కడికి వెళ్లి అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు . 

ఎల్ .వి ప్రసాద్ మద్రాసు వచ్చేయడంతో తిలక్ కూడా మద్రాస్ వచ్చాడు. ఎం .వి .రాజన్ అనే ఫిలిం ఎడిటర్ దగ్గర చేరాడు . 

ఈ ఇద్దరు కల్సి సినిమాలకు ఎడిటర్లుగా  పనిచేస్తున్నారు . 

నవయుగ ప్రొడక్షన్స్ సంస్థ సి .వి. శ్రీధర్ దర్శకత్వంలో "జ్యోతి " అనే సినిమా మొదలు పెట్టారు . ఈ సినిమాలో జి .వరలక్ష్మి , సావిత్రి, శ్రీరామ మూర్తి, కశ్యప నటించారు . అయితే శ్రీధర్ కు నిర్మాతలకు మాట పట్టింపు వచ్చి శ్రీధర్ దర్శకత్వం నుంచి తప్పుకున్నారు . 

అప్పుడు నిర్మాతలు తిలక్ ను దర్శకత్వం వహించమని కోరారు . మొత్రులు కూడా ప్రోత్సహించారు . ఆలా ఆగిపోయిన "జ్యోతి" సినిమాను తిలక్ పూర్తి చేశారు . ఈ సినిమా 30 ఏప్రిల్ 1954లో విడుదలయ్యింది . 

ఆ తరువాత తిలక్ అనుపమ ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించి "ముద్దు బిడ్డ " అన్న సినిమాను ప్రారంభించారు . జ్యోతి సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జి .వరలక్ష్మి ని తీసుకున్నారు . సినిమా షూటింగ్ సగం అయిన తరువాత ఒక డైలాగ్ విషయంలో  మనస్పర్థలు వచ్చాయి . తిలక్ రాజీపడనని చెప్పారు . వరలక్ష్మి సినిమా నుంచి తప్పుకుంటామని బెదిరించింది . తిలక్ ఆమె స్థానంలో లక్ష్మి రాజ్యం ను ఎంపిక చేసి మళ్ళీ షూటింగ్ ప్రారంభించారు.  

ఆ తరువాత  ఎం.ఎల్.ఏ. (1957) అత్తా ఒకింటి కోడలే (1958) చిట్టి తమ్ముడు (1962)

ఉయ్యాల జంపాల (1965) ఈడుజోడు (1967) పంతాలు పట్టింపులు (1968) ఛోటీ బహు, కంగన్ (1971)

భూమి కోసం (1974) కొల్లేటి కాపురం (1976) ధర్మవడ్డీ (1982) చిత్రాలను రూపొందించారు . 

నిర్మాత , దర్శకుడు యు.విశ్వేశ్వర రావు దర్శకత్వం రూపొందించిన  "నగ్నసత్యం" సినిమాలో తిలక్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు . 



తిలక్ పై ప్రజానాట్యమండలి , వామపక్ష భావ జాలం ఎక్కువగా వుంది . ఆయన నిర్మించిన సినిమాలు కుటుంబ విలువలు , సామాజిక న్యాయం , సమకాలీన సమస్యలను ప్రతిబింబించేవి . 

తిలక్ సినిమాల్లో పాటలు కూడా అత్యంత ప్రజాదరణ పొందాయి . 

భారత , పాకిస్తాన్ రాజకీయంగా విడిపోయినా , ఐదు దేశాల ప్రజలు సోదర  భావంతో వుండాలని కోరుకున్నాడు . ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధం వుండాలని కృషి చేసిన అభ్యుదయవాది తిలక్ . 

సెప్టెంబర్ 23, 2010లో తిలక్ అహలోక యాత్ర ముగించారు . 

Comments

Popular posts from this blog