Posts

Showing posts from August, 2023
Image
                                  'గాయం' 100 రోజుల వేడుక ఈరోజు అందాల నటి శ్రీదేవి 60వ జయంతి. జర్నలిస్టుగా ఆమెతో నాకు పరిచయం వుంది , అనేక ఇంటర్వ్యూలు కూడా చేశాను. భారతీయ తెర మీద చెక్కుచెదరని అపురూప, అద్వితీయ నటి శ్రీదేవి. 30 సంవత్సరాలనాటి ఓ జ్ఞాపకం . రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన 'గాయం ' సినిమా లో హీరో జగపతి బాబు , రేవతి , ఊర్మిళ నాయికలు . ఈ సినిమా 22 ఏప్రిల్ 1993లో విడుదలై ఘన విజయం సాధించింది .   ఆగస్టులో 'గాయం ' సినిమా శతదినోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని మొదటి ఫ్లోర్ లో వైభవంగా జరిగింది . అప్పట్లో రామ్ గోపాల వర్మ చిత్రాల పబ్లిసిటీ నేను చూసేవాడిని . 'గాయం' సినిమా శతదినోత్సవ వేడుకకు శ్రీదేవిని ముఖ్య అతిథి గా వచ్చి జ్ఞాపికలను అందించారు . శ్రీదేవి నుంచి 'గాయం ' మెమొంటో ను స్వీకరించినప్ప్పటి ఫోటో . 1991లో రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ , శ్రీదేవితో 'క్షణం క్షణం ' సినిమా రూపొందించారు . ఆ పరిచయంతో రామ్ గోపాల్ వర్మ ఆహ్వానించగానే శ్రీదేవి ఈ కార్యక్రమానికి వచ్చారు . ...
Image
                     ఆకాశవాణిలో నా జీవన ప్రస్థానం  నా వృత్తిజీవిత ఆరంభంలో నన్ను ఆర్ధికంగా నిలబెట్టింది ఆకాశవాణే” అంటున్న సీనియర్ సినీ పాత్రికేయులు రచయిత, పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత భగీరథ గారితో గోపీచంద్ మాటామంతి తెలంగాణ రాష్ట్రంలోని ఆకాశ వాణి కేంద్రాలు ప్రసారం 10 జులై 2023న ప్రసారం చేశాయి . 
Image
" ఎన్. టి. ఆర్. విగ్రహం భావితరాలకు స్ఫూర్తి " - టి .డి .జనార్దన్ తెలుగువారి ఆరాధ్య నటుడు, మహా పురుషుడు ఎన్ .టి .రామారావు గారి శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగడం, ఆయన పట్ల ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని అభిమానానికి నిదర్శనమని చెప్పవచ్చు. అన్నగారి శత జయంతి వేడుకల్లో మా కమిటీ భాగస్వామి కావడం, వారి స్ఫూర్తి ఎప్పటికీ ఉండేలా కార్యక్రమాలను చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చైర్మన్ టి .డి జనార్దన్ చెప్పారు ఈరోజు ఫిలింనగర్ లోని నిర్మాతల మండలి హాలులో మీడియా సమావేశం ఏర్పాటు చేశాము. జనార్దన్ గారు అమెరికా వెళ్లి వివిధ నగరాల్లో పర్యటించి అన్నగారి శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు . ఆ వివరాలను మీడియా కు తెలిపారు . 'మేము ఏ ముహూర్తాన అన్నగారి శత జయంతి వేడుకలు తలపెట్టామో , అవి నిర్విఘ్నంగా , నిరాటంకంగా మన దేశంలోనే కాదు అమెరికాతో పాటు మిగతా దేశాల్లో జరగడం అన్న గారు దైవంశసంభూతుడని రుజువు చేశాయి . అన్నగారి ఉపన్యాసాలను, శాసన సభ ప్రసంగాలు , చారిత్రిక ప్రసంగాలు పేరుతో రెండు గ్రంధాలను ప్రచురించాము . ఆ పుస్తకాలను విజయవాడ లో జరిగిన సభలో విడుదల చేశాము . ఆ సభతో మా కమిటీ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్త...
Image
                             4 5 సంవత్సరాల నాటి అరుదైన ఫోటో తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెర పై చూపించిన గొప్ప సినిమా 'మాభూమి '. ఇది గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. బి.నరసింగ రావు , జి .రవీంద్రనాథ్ ఈ సినిమాను రూపొందించారు . ఇందులో సాయి చంద్ ,భూపాల్ రెడ్డి , రామ్ రెడ్డి, బి , నరసింగ రావు, తెలంగాణ శకుంతల , ప్రదీప్ శక్తి ,కాకరాల , గద్దర్ మొదలైన వారు నటించారు . 'బండెనక బండి కట్టి, పదహారు బళ్ళు కట్టి ఈ బండ్లో వస్తావు ..' పాటను గద్దర్ పాడటమే కాదు ఇందులో నటించారు . ఈ పాట చిత్రీకరణ ప్రజ్ఞాపూర్ లో జరిగింది . పా ట చిత్రీకరణ పూర్తి అయిన తరువాత నిర్మాత ,నటుడు నరసింగ రావు , భూపాల్ రెడ్డి , గద్దర్ కలసి తీయించుకున్న ఫోటో ఇది. 'మా భూమి ' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా హైదరాబాద్ శ్రీ సారథి స్టూడియోస్ లోనే జరిగింది . అప్పుడు నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా ఆ సినిమా వార్తలు కవర్ చెయ్యడానికి వెళ్ళేవాడిని . అప్పుడు నరసింగ రావు గారు గద్దర్ ను నాకు పరిచయం చేశారు. ఆ అప్పటి నుంచి నరసింగ రావు , గద్దర్ అనుబంధ...
Image
                    జగదీష్ ప్రసాద్ గారికి 'శకపురుషుడు' ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భగా మేము వెలువరించిన 'శకపురుషుడు ' ప్రత్యేక సంచికను ఒకప్పటి ఆంధ్ర జ్యోతి  మేనేజింగ్ డైరెక్టర్ కానూరి జగదీష్ ప్రసాద్ గారికి బహుకరించాను . 'శకపురుషుడు ' ప్రత్యేక సంచిక సినిమా విభాగం నా  సంపాదకత్వంలో వచ్చిందని చెప్పగానే,  'చాలా మంచి ప్రయత్నం '. ఎప్పటికీ నిలిచిపోయే పుస్తకం . చాలా బాగుంది . కంగ్రాట్యులేషన్స్'   అన్నారు .  ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడిన  జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక లో నేను 12సంవత్సరాలు పనిచేశాను . అప్పటి అనుభవాలన్నీ ఇద్దరం గుర్తుచేసుకున్నాము . జగదీష్ ప్రసాద్ గారు నన్ను ఒక ఉద్యోగి లా కాకుండా స్నేహితుడుగా చూసేవారు . ఆంధ్ర జ్యోతి లో పనిచెయ్యడం వల్లనే నేను ఎదిగానని భావన నాలో వుంది . అందుకే నేను ఎన్ .టి .రామారావు గారి శతాబ్ది సందర్భంగా రచించిన 'మహానటుడు ,ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ ' అన్న పుస్తకాన్ని అంకితం ఇచ్చాను . 
Image
  భగీరథ "నాగలాదేవి" చరిత్రకు వీరతిలకం  ఒక కథనో, నవలనో, పుస్తకాన్నో చదివాక హర్షం వర్షమై గుండెను తడపాలి. చదివిన ప్రతి ఘట్టంలోనో , సన్నివేశంలోనో తీయని అనుభూతి మనల్ని వెంటాడాలి .  దృశ్యం వెంట దృశ్యం మనల్ని వేగంగా నడిపించుకుంటూ కథ వెంట పరుగు తీయించాలి . చరిత్ర పొరల్లో దాగిన రసమయ గాథను చదువుతుంటే మనసు నవరసభరితమై, ఆనంద తాండవం చేయాలి .  భాష, భావం కలగలిపి, వర్ణనలతో జతకలసి, కల్పనలను కలగలుపుకొని చిరస్మరణీయమైన చరిత్రను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచెయ్యాలి.  శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ "నాగలాదేవి " నవల చదువుతున్నప్పుడు నాకు కలిగిన అనుభూతి ఇది . మనసు పొంగి పరవశంతో రాసిన పంక్తులివి. అక్షరాలు  కుప్ప పోస్తే పుస్తకమవుతుంది.  అందులోని  పేజీల్లో  రసార్ద్రత ఉండదు .  వాక్యాలు పేరిస్తే కవిత్వమవుతుంది .  అందులో గుండెను తట్టే అనుభూతి ఉండదు. అక్షరాలు కుప్పపోయడం, వాక్యాలు పేర్చడం రచన లక్షణం కాదని  సంపూర్ణంగా గ్రహించిన,  అనుభవవం పండిన ఓ రచయిత కలం నుండి జాలువారిన రసప్రవాహం "నాగలాదేవి " నవల .   "ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగునపడి కాన్పించని, కథలన...
Image
 అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని విగ్రహం  చాలా కాలం తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాను  ఎన్. టి. ఆర్. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా కమిటీ వెలువరించిన 'శకపురుషుడు ' ప్రత్యేక సంచికను మీకు ఇవ్వాలి, ఎప్పుడు రమ్మంటారు ?   అని అక్కినేని నాగేశ్వర రావు గారి రెండవ అమ్మాయి నాగ సుశీల గారికి ఫోన్ చేశాను .  'అయితే మీరు  స్టూడియోస్ కు రండీ, నేను అక్కడకు వస్తున్నా' అని చెప్పారు.    సుశీల గారిని కలవడానికి అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాను.  ఆ స్టూడియోస్ లోకి అడుగు పెట్టగానే ఎన్నెనో స్మృతులు గుర్తుకొచ్చాయి .  అప్పుడే నాగ సుశీల గారు వచ్చారు . నన్ను చూడగానే బాగున్నారా ? చాలా కాలమవుతుంది ' అన్నారు .  'నేను బాగున్నా , మీరు ?'  నేను కూడా బాగున్నా , రండి ' అని సుప్రియ ఆఫీసులోకి తీసుకెళ్లారు . మమల్ని చూడాగానే సుప్రియ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు .  'చాలా కాలం తరువాత మిమల్ని చూశాను , ఎలా వున్నారు ?' ఆప్యాయంగా అడిగింది సుప్రియ .  'బాగున్నా సుప్రియా ' అని చెప్పాను .  మా ఇద్దరినీ ఓ పెద్ద క్యాబిన్ లోకి తీసుకెళ్లి కూర్చోమన్నారు ....