స్మృతి చిత్రమ్ ఈరోజు మహా నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి . 1996 జనవరి 18న రామారావు గారు తన 72వ ఏట భౌతికంగా మరణించారు . ఎన్ .టి .ఆర్ ఆ మూడక్షరాలు ఎప్పటికీ చెరగని , చెదరని పేరు . తెలుగు వారందరికీ ప్రాతః కాల స్మరణీయులు .
Posts
Showing posts from January, 2022
- Get link
- X
- Other Apps
ప్రాణదాత సినిమాకు 30 ఏళ్ళు శ్రీ అనుపమ ప్రొడక్షన్ పతాకంపై డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు , లక్ష్మితో మోహన్ గాంధీ దర్శకత్వంలో రూపొందించిన "ప్రాణదాత "సినిమాకు జనవరి 14తో 30 ఏళ్ళు , ఈ సినిమాను పి .బలరాం , కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించారు . నేను నిర్మించిన సినిమాల్లో ప్రాణదాత కు ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి . నా అభిమాన హీరో అక్కినేని నాగేశ్వర రావు గారితో నేను నిర్మించిన మొదటి సినిమా ప్రాణదాత. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నిర్మించాము . మహానటుడు నాగేశ్వర రావు గారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మాతో పాటు గుడ్లవలేరు లాటి పల్లెటూరిలో వున్నారు . క్రమశిక్షణ కు మారు పేరు నాగేశ్వర రావు గారు . ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను . ప్రాణదాత సినిమా ఎన్నో మధుర స్మృతులను మిగిల్చిన దని నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ చెప్పారు . నాకు చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వర రావు అంటే ఎంతో అభిమానం , పంపిణీదారుగా వున్న నేను సినిమా నిర్మాణంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు . నాగేశ్వర రావు గారితో ప్రాణదాత, కాలేజీ బుల్లోడు రెండు సినిమాలు రూపొందిస్తానని కూడా అనుకోలేదు . ఆ రెండు సినిమ...
- Get link
- X
- Other Apps
త్వరలో "దొరకునా ఇటువంటి సేవ" సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది.. అవి భార్యాభర్తల గొడవలు, వాటిలో ఎవ్వరు తల దూర్చరు. పక్కింటోడు, పోలీసులు కాదు కదా ఆఖరికి పేరెంట్స్ కూడా తల దూర్చరు.. అందుకే అది ఈరోజు టాప్ క్రైమ్ గా మారింది. రీసెంట్ గా ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి పది మందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారనితేలింది. క్షణికానందం కోసం అడ్డొస్తే అది ఎవరనేది కూడా చూడకుండా క్షణికావేశంలో చంపు కుంటూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి కథలను ఎవ్వరూ ధైర్యం చేయలేని విధంగా బోల్డ్ గా పక్కాగా తెర కి ఎక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అని ఎన్నో సినిమాలు నిరూపించాయి . ఈ సినిమా ద్వారా బోల్డ్ గా మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశాము. సందీప్ పగడాల, నవ్య రాజ్ హీరో హీరోయిన్లుగా... వెంకీ దడ్‌బజన్, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాం...
- Get link
- X
- Other Apps
డాక్టర్ దాసరి "దర్శకరత్న" బయోపిక్ సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం ఇప్పుడు వెండితెరకెక్కబోతోంది. 'దర్శకరత్న'' పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని త్వరలో ప్రాంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై సీనియర్ దర్శకుడు ధవళసత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మించే ఈ చిత్రం ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా శ్రీశైలం వంటి భారీ బడ్జెట్ హిట్ సినిమాను ఇదే నిర్మాత నిర్మించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా ఈ చిత్రం గురించిన విషయాలను తెలియజేసేందుకు గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ధవళసత్యం తెలియజేస్తూ, చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి, రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గ...
- Get link
- X
- Other Apps
నాగార్జున "డెత్ గేమ్" టీజర్ ఆవిష్కరణ శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్, హీరో హీరోయిన్ లుగా చేరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "డెత్ గేమ్".. కె.సి నూరి, రాజశేఖర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను ఈరోజు నాగార్జున రిలీజ్ చేశారు నాగార్జున : "డెత్ గేమ్" చిత్ర యూనిట్ కి అల్ ద బెస్ట్ చెప్పారు. దర్శకుడు చేరన్ మాట్లాడుతూ : డెత్ గేమ్ వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నామని.., సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని మార్చిలో రీలీజ్ చేస్తామని అన్నారు. హీరో అమర్ మాట్లాడుతూ : సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అన్నారు.. టీజర్ రీలీజ్ చేసిన అక్కినేని నాగార్జున కి కృతఙ్ఞతలు తెలిపారు...
- Get link
- X
- Other Apps
దర్శకుల సంఘం సభ్యులకు హెల్త్ చెకప్ " తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం" అధ్యక్షుడు.. వై. కాశీ విశ్వనాథ్, దర్శకుల సంఘం జనరల్ సెక్రటరీ.. వి.యన్ ఆదిత్య, ట్రెజరర్.. భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కమ్ యాక్టర్ మాదాల రవి సహకారంతో, ‘మెడికవర్’ హాస్పటల్స్‌చే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్‌కు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు డాక్టర్ మాదాల రవి, మెడికోవర్ క్లస్టర్ హెడ్ డాక్టర్ దుర్గేష్ శివ (మెడికోవర్ క్లస్టర్ హెడ్), డాక్టర్ రిచా నిరాల (మెడికోవర్ సెంట్రల్ హెడ్), సంతోష్ శుక్లా (ఏ.జి.యమ్ మార్కెటింగ్ హెడ్), మరియు " నాంది" డైరెక్టర్ విజయ్ కనకమేడల.. దర్శకులు.. రవి కుమార్ చౌదరి, వీరశంకర్, చంద్రమహేష్, సముద్ర, వీరభద్రం చౌదరి, దొరైరాజ్, నటుడు, నిర్మాత.. సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ...ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టిన వారు, అవసరంలో ఉన్నవారికి సాయం చేసినవారు, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం చేసిన...
- Get link
- X
- Other Apps
39 సంవత్సరాల క్రితం ఈరోజు . మహానటుడు ఎన్ .టి. రామారావు గారు 1982 మార్చి లో తెలుగు దేశం పార్టీని ప్రారంభించి, 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన అనన్య సామాన్యుడు , అనితర సాధ్యుడు రామారావు గారు . 1983 జనవరి 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్న రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినరోజు. . రామారావు గారితో జర్నలిస్టు గా నాకు ఎన్నో మధుర స్మృతులు వున్నాయి .
- Get link
- X
- Other Apps
"పల్లె గూటికి పండగొచ్చింది" పోస్టర్ దివ్య తేజస్విని పతాకంపై రోహిత్ కృష్ణ సంతోష్ నిఖిత హర్షిత నటీనటులుగా నిర్మిస్తున్న చిత్రం "పల్లె గూటికి పండగొచ్చింది". ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు. చిత్ర దర్శకుడు తిరుమల్ రావు మాట్లాడుతూ . పల్లెల్లో ఉన్న యువత ఏ రకంగా చెడు మార్గం లో వెళుతున్నారు.వారి ప్రవర్తనను మంచి మార్గంలో మళ్లిస్తే ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలా విజయం సాధించ వచ్చునో చిత్ర కథాంశం తో రూపొందిన చిత్రం . రాజకీయ నాయకుల సహకారం లేకుండా కూడా ఒక పల్లె ను ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అనే పాయింట్ గా తీసుకొని చేసిన సినిమా.ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులోని క్లైమ్యాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆన్నారు. నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ.."పల్లె గూటికి పండగొచ్చింది" సినిమాలో .. మా అబ్బాయి హీరోగా యాక్ట్ చేశాడు. దర్శకుడు ఈ కథను చాలా చక్కగా తీశాడు.ఇంకా ఈ సినిమాలో నిఖిత, హర్షిత, సుమన్, సాయి కుమార్ ,శియాజి షిండే, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ రాజమౌళి ,జబర్దస్త్ అప్పారావు ,రోలర్ రఘు, గుం...
- Get link
- X
- Other Apps
అక్కినేని సంక్రాంతి చిత్రాలు తెలుగు సినిమా రంగానికి అక్కినేని నాగేశ్వరావు 1941 ధర్మ పత్ని సినిమాతో పరిచయం అయ్యారు . నటుడుగా ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు . సంక్రాంతి పండుగకు అక్కినేని నటించిన ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి . అవి ఏమిటో ఈ క్రింద పట్టికలో చూడవచ్చు . Courtesy : Suribabu, Guntur.
- Get link
- X
- Other Apps
"ధగడ్ సాంబ "గా సంపూర్ణేష్ బాబు ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా " ధగడ్ సాంబ" నిర్మిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, సోనాక్షి నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ . ఇటీవల సారథి స్టూడియోలో చివరి పాట చిత్రీకరణతో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ధగడ్ సాంబ సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ సంపూర్ణేష్ ఈ సినిమాలో చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. మూవీలోని పాటల కోసం అద్భుతమైన సెట్స్ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. ధగడ్ సాంబ చిత్రంలో హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకొని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు నిర్మాత అర్.ఆర్, దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి.