
నగర కేంద్ర గ్రంథాలయంలో నా పుస్తకాలు అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంథాలయంలో నేను రచించిన పుస్తకాలను లైబ్రేరియన్ శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి బహుకరించాను. శ్రీ త్యాగరాయ గానసభలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అశోక్ నగర్ వెడుతూ 'నాగలాదేవి', 'భారతమెరికా ', 'భగీరథ పథం ', ' మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ ' పుస్తకాలను తీసుకెళ్ళాను . అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయం తో నాకు ఎంతో అనుబంధం వుంది . 1971లో నేను హైదరాబాద్ వచ్చిన తరువాత చదువుకుంటూనే ఈ గ్రంథాలయానికి తరచూ వచ్చేవాడిని. 1971 నుంచి 1977 వరకు అంటే నేను 'వెండితెర ' పత్రికలో చేరేవరకు ఈ గ్రంథాలయం రచయితగా నా ఎదుగుదలకు ఎంతో తోడ్పడిందని చెప్పగలను . అందుకే ఈ గ్రంథాలయంలో నా పుస్తకాలు ఉండాలని లైబ్రేరియన్ శ్రీమతి సుబ్బలక్ష్మి గారిని కలసి వారికి పుస్తకాలు బహుకరించాను . 'మీ పేరు విన్నాను , మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది సార్ ' అని సుబ్బలక్ష్మి గారు చెప్పారు . ఈ గ్రంథాలయంలో వున్న హాల్ లో 1980 జూన్ 1న నేను రచించిన 'మానవత' కవితా సంపుటిని మహాకవి శ్రీ శ్రీ ఆవిష్కరించారు . నా జీ...