Posts

Image
  వెంకయ్య నాయుడు గారి ఆత్మీయత  భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు  వెంకయ్య నాయుడు గారు ఏప్రిల్ 4న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కు వచ్చారు .  కల్చరల్ సెంటర్ కార్యదర్శి తుమ్మల రంగారావు గారి తండ్రి గారి  11వ రోజు కార్యక్రమానికి వెంకయ్య నాయుడు గారితో పాటు టి .డి .జనార్దన్ , బంగారు గారిని కూడా ఆహ్వానించారు . వెంకయ్య నాయుడు గారిని నేనే స్వయంగా రిసీవ్ చేసుకున్నాను . అందరూ కలసి ఒక టేబుల్ మీద కూర్చొని భోజనం చేశారు . 
Image
  భగీరథకు కళారత్న  అవార్డు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథకు కళారత్న అవార్డు ను  ప్రదానం చేశారు.    మార్చి 30న  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు భగీరథకు  కళారత్న అవార్డును  బహుకరించి అభినందించారు.  జర్నలిజంలో 45 సంవత్సరాల అనుభవం వున్న భగీరథ 1997, 2001లో రెండు పర్యాయాలు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నంది అవార్డులు , 2011లో ఎన్ .టి .ఆర్ . కమిటీ ఉత్తమ జర్నలిస్టు అవార్డు , 2020లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం , ఢిల్లీ తెలుగు  అకాడమీ , వంశీ , కిన్నెర, యువకళా  వాహిని,  శృతిలయ , కమలాకర కళా భారతి , బళ్లారి తెలుగు సంస్కృతీ లాటి సంస్థల నుంచి 20 అవార్డులను భగీరథ స్వీకరించాడు .  నంది అవార్డుల కమిటీ , జాతీయ సినిమా అవార్డుల కమిటీ , ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యుడుగా భగీరథ పనిచేశాడు .  ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా ఏర్పాటైన కమిటీ  "శకపురుషుడు ", "తారకరామం" రెండు గ్రంథ...
Image
 'తారకరామం "ఆధునిక భగవద్గీత  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో  జనవరి 18న నా 'తారకరామం ' పుస్తకం పై సమీక్ష సమాలోచన జరిగింది . ఈ సభకు సంబంధించిన వార్త.  తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.  ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు.  జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన...
Image
  నాగేశ్వర రెడ్డి గారికి  శకపురుషుడు  వైద్య రంగంలో అత్యున్నత సేవలందించినందుకు డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది .  నాగేశ్వర రెడ్డి గారు గ్యాస్ట్రో ఎంటరాలజీ లో అత్యుత్తమ నిపుణులు. హైద్రాబాద్ లోని   ఆసియన్  ఇనిస్టిట్యూట్ అఫ్  గాస్ట్రోఎంటరోలాజి  ఆసుపత్రి వ్యవస్థాపకులు.   ఈ విభాగంలో ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు . ఇప్పటికే వారికి పద్మశ్రీ , పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి .  దేశంలోనే అత్యున్నత రెండవ పురస్కారం రావడం వారిని అభిమానించేవారందరికీ గర్వకారణం .  నాగేశ్వర రెడ్డి గారు ఈ దేశానికి తనసేవలను కొనసాగిస్తారని , వైద్య రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నా .  నాగేశ్వర రెడ్డి గారికి నేను సంపాదకత్వం వహించిన శకపురుషుడు , తారకరామం పుస్తకాలను బహుకరించాను .
Image
  బళ్లారిలో నాగలాదేవి ఆవిష్కరణ  నేను రచించిన నాగలాదేవి నవల ఫిబ్రవరి 16 ఆదివారం సాయంత్రం బళ్లారిలో ఆవిష్కరణ జరుగుతుంది .  శ్రీకృష్ణదేవరాయల అజరామమైన ప్రేమ కథే నాగలాదేవి నవల . కృష్ణదేవరాయలు యువకుడుగా వున్నప్పుడు ప్రేమించిన అమ్మాయే నాగలాదేవి . అపురూప సౌందర్యవతి ,  అద్భుత నర్తకి , అసమానమైన వ్యక్తిత్వం నాగలాదేవి స్వంతం .  బళ్లారిలో వున్న తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఆర్ .వీరన్న గారు నాగలాదేవి  నవల చదివి బళ్లారిలో తెలుగు సంస్కృతి సంస్థ , బలిజ సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ ఏర్పాటుచేశారు .  బళ్లారిలో ఉన్న సాహితీ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు .
Image
 విజయవాడలో  'తారకరామం '  శనివారం రోజు విజయవాడ నగరంలోని మురళి రిసార్ట్స్ లో నేను సంపాదకత్వం వహించిన 'తారకరామం ' గ్రంథాన్ని భారత మాజీ ఉపాధ్యక్షులు , పద్మభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు . తొలి ప్రతిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు స్వీకరించారు .  ఎన్ .టి .ఆర్ .లిటరేచర్ కమిటీ  చైర్మన్ జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది .  ఎన్ .టి .ఆర్ . నటించిన 'మనదేశం' సినిమా విడుదలై 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 'తారకరామం ' పుస్తకాన్ని వెలువరించాము . అలనాటి నటి మనదేశం సినిమా నిర్మాత కృష్ణవేణి గారు ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు .  ఈ కార్యక్రమంలో జయప్రద , ప్రభ, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామల , బాబూమోహన్ , నిర్మాత అనురాధాదేవి , నిర్మాతలు ఆది ఆదిశేషగిరి రావు , సురేష్ బాబు , కె .ఎస్ .రామారావు , స్రవంతి రవి కిషోర్ ,  డి .వి. కె .రాజు , దామోదర ప్రసాద్ , కైకాల నాగేశ్వర రావు , అట్లూరి నాగేశ్వర రావు  మొదలైనవారు హాజరయ్యారు .  తారకరామం పుస్తకం వెంకయ్య నాయుడు గారు , చంద్ర బాబు నాయ...
Image
 ఈనాడు రామోజీ రావు గారు అస్తమయం  తెలుగు పత్రికా రంగంలో చెరగని ముద్రవేసిన పద్మవిభూషణ్ రామోజీ రావు గారు ఇక లేరు అన్న విషాద వార్త నన్ను కలవరపరిచింది .  పత్రికా రంగం , సినిమా రంగం , వ్యాపార రంగాల్లో ఆయన సాధించిన ప్రగతి అపూర్వం , అనితర సాధ్యం .  రామోజీ రావు గారితో నాకు 1983 నుంచి పరిచయం .  ఎన్ .టి .రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటిసారి రామోజీ రావు గారిని జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక (ఆంధ్ర జ్యోతి సంస్థ ) రిపోర్టర్ గా ఇంటర్వ్యూ చేశాను. ఈనాడు కార్యాలయంలో రెండవ ఫ్లోర్ లో ఉండేవారు .  అప్పుడు  వారు నా పట్ల చూపించిన అభిమానం,  ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేను. రామోజీరావు గారితో నేను చేసిన ఆ  ఇంటర్వ్యూ సంచలనం  సృష్టించింది . ఆ తరువాత అనేక సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. నా పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించేవారు .  1987 ఫిబ్రవరి 8న నా వివాహ రిసెప్షన్ కు వారిని ఆహ్వానించాను. నేను  ఆంధ్ర జ్యోతి లో పనిచేసేవాడిని . ఈనాడులో పనిచేయలేదు కాబట్టి వారు హాజరు కారు అనుకున్నాను. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన రిసెప్షన్ కు రామోజీ రావు గారు మయూర...