ఆచార్య సినిమా షూటింగ్ కు సైకిల్ పై సోను సూద్
సోనూ సూద్ . దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో ఉండిపోయిన పేరు. కరోనా మహమ్మారి కాటేసిన వేళలో లక్షలాది మంది దిక్కుతోచక రోడ్ల మీద కాలినడకన స్వస్థలాలకు వెళుతుంటే.. వారిని స్వచ్చందంగా ఆదుకున్న సోనూసూద్ సహాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్యలో చిత్రంలో సోనుసూద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లొకేషన్ కు సోనుసూద్ సైకిల్ మీద వెళ్లారు . సోనూసూద్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉదయాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అందుకే మరేమీ ఆలోచించకుండా సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్రయాణం రెండూ కలిసొచ్చేశాయి.
మసాలా మూవీ "స్ట్రీట్ లైట్ ట్రైలర్ " మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో విశ్వ దర్శకత్వంలో శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం స్ట్రీట్ లైట్. ఈ చిత్రం టీజర్ ను దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి విడుదల చేయగా, ట్రైలర్ ని నిర్మాత సి కళ్యాణ్ విడుదల చేశారు . సి కళ్యాణ్ మాట్లాడుతూ .. పాట .. చాలా బాగుంది.. రామసత్యనారాయణ పాన్ ఇండియా అంటున్నారు.. ఇది హాలీవుడ్ కు వెళ్లినా బాగుంటుందేమో అని నా అభిప్రాయం. నిర్మాత శ్రీనివాస్ మంచి థాట్స్ తో ఈ సినిమా తీశారు.. కానీ సెన్సార్ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఇక ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను మించిపోయారు అ...
Comments
Post a Comment