నేపధ్య గాయని, ఎస్ .జానకి ఇక లేరు . 

ఆమె తన 88వ ఏట జులై 11న ఇహలోక యాత్ర ముగించారు . 

భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో  గాన కోకిల ఎస్. జానకి గారిది అద్వితీయమైన స్తానం .

ఆమె  తన మధుర గాత్రంతో ఐదు దశాబ్దాలకు భారతీయ  శ్రోతలను అలరించిన మధుర  నేపధ్య గాయని. 

ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో రేపల్లెలో వాళ్లపట్ల గ్రామంలో  జన్మించారు. ఆమెకు ఎటువంటి సాంప్రదాయ సంగీతంలో అధికారిక శిక్షణ లేకపోయినప్పటికీ, నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం  నేర్చుకున్నారు . 



1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు   'విధియిన్‌ విలాయత్తు' అనే చిత్రం ద్వారా చిత్ర రంగంలో పరిచయం చేశారు . 

తెలుగులో ఆమె మొదటి చిత్రం  'ఎమ్మెల్యే. నిర్మాత కె .బి .తిలక్ రూపొందించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు , ఈ సినిమాలో 'నీ ఆశా అడియాశా .. చెయి జారే మణిపూస..  బ్రతుకంతా అమవాసా ...లంబాడోళ్ళ రాందాసా' అనే పాటను ఘంటసాలతో కలసి పాడారు . ఈ గీతాన్ని  ఆరుద్ర వ్రాశారు . 

తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో 48,000 కంటే ఎక్కువ పాటలు పాడారు.

ఆమెకు  4 జాతీయ చలనచిత్ర అవార్డులు,  10 నంది అవార్డులు మరియు ఇతర రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించగా, దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె ఆ అవార్డును తిరస్కరించి తన నిరసనను తెలిపారు.

ఆమె భారతరత్న అవార్డుకు అర్హత వున్న గాయని . 

శ్రీమతి జానకి ఎన్నో వైవిధ్యమైన పాటలను గానం చేశారు .

జానకి గారిని ఏను 1980లో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇంటర్వ్యూ చేశాను .

ఆమె ఎప్పటికీ తెలుగువారి మనస్సులో పదిలంగానే వుంటారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు