
శ్రీ శ్రీ "మహాప్రస్థానం" నాకు స్ఫూర్తి - భగీరథ ఆధునిక మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ) అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు . 1950వ సంవత్సరంలో రచించిన "మహాప్రస్థానం" అప్పట్లో పెను సంచలనం కలిగించింది . అప్పటివరకు సాంప్రదాయ పద్దతిలో కవులు ఛందోబద్దమైన కవిత్వాన్ని వ్రాసేవారు . శ్రీ శ్రీ " మహాప్రస్థానం "లో వచన కవిత్వానికి శ్రీకారం చుట్టాడు . ఛందోబద్దమైన కవిత్వాన్ని పక్కన పెట్టాడు . ఇది శ్రీ శ్రీని సరికొత్తగా ఆవిష్కరించింది . యువ కవులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కవిత్వం వ్రాయడం మొదలు పెట్టారు . శ్రీ శ్రీ ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడు . వైతాళికుడు . అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు గా , విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడుగా , సినిమా పాటల కవిగా శ్రీ శ్రీ జీవిత ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం . ఈ రోజు 112వ జయంతి . తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసి, నవ యువ కవులకు మార్గ నిర్ధేశకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా ఎప్పటికీ మిగిలిపోయిన మహాకవితో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది . 1979లో ...