దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి. 


ఈరోజుమహాకవి దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి.  

ఉర్దూలో మెట్రిక్యులేషను, తరువాత భోపాల్ విశ్వవిద్యాలయంలో  ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో  ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. 

తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం చెప్పడంలో  ప్రావీణ్యం సంపాదించాడు.. 

 ఆశువుగా కవితలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు . 

చదువుకునే రోజుల నుంచే బానిసత్వాన్ని నిరసించేవాడు . నిజాం పాలనకు వ్యతిరేకంగా కలం తో నినదించారు . 



ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాస్తున్నడని 1947లో ఆయన్ని జైలులో పెట్టారు . 

అయినా  నిజాం అరాచకాలను ఖండిస్తూ జైలు గోడల మీద కవితలు వ్రాస్తూనే వున్నారు .

"ఓ నిజాము పిశాచమా! కానరాడు

నిన్నుబోలిన రాజు మాకెన్నడేని,

తీగలను తెంపి అగ్నిలో దింపినావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ!"  అని నిజాముపై నిప్పులు కురిపించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య . 

అలాగే తెలుగు గురించి ...

"ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!

ఎవరు రాయలు! ఎవరు సింగన!

అంతా నేనే! అన్నీ నేనే!

అలుగు నేనే! పులుగు నేనే!

వెలుగు నేనే! తెలుగు నేనే!" అని చెప్పిన ధీశాలి ఆంధ్ర కవితా సారధి దాశరథి . 

దాశరథి గారు ఎంతో సౌమ్యులు , ఎవరినీ నొప్పించేవాడు కాదు . అయితే కవిగా ఆయన దృఢచిత్తం కలవాడు . తనకు నచ్చకపోతే 

కవిత్వం ద్వారా ధ్వజం ఎత్తేవాడు . 

దాశరథి గారు అనేక  కావ్యాలు రచించారు . 

అగ్నిధార (ఖండ కావ్యం)

మహాంధ్రోదయం (ఖండ కావ్యం)

రుద్రవీణ (ఖండ కావ్యం)

అమృతాభిషేకం (ఖండ కావ్యం)

ఆలోచనాలోచనాలు (ఖండ కావ్య)

ధ్వజమెత్తిన ప్రజ (ఖండ కావ్యం)

కవితాపుష్పకం ( ఖండ కావ్యం)

తిమిరంతో సమరం (ఖండ కావ్యం)

నేత్ర పర్వం (ఖండ కావ్యం)

పునర్నవం (ఖండ కావ్యం)

గాలిబ్ గీతాలు (అనువాద కవిత)

నవమి (వచన నాటిక)

నవమంజరి (లలిత గీతాలు)

ఖబడ్దార్ చైనా (ఖండ కావ్యం)

వ్యాసపీఠం (వివిధ సాహిత్య వ్యాసాల సంపుటి విమర్శ)

జయదేవకృత గీతగోవింద కావ్యం (వ్యాఖ్యానం),

మిన్నేటిపొంగులు (హీరాలాల్ మోరియా కవితలకు అనువాదం),

ప్రణయసౌధం (అనువాదకావ్యం),

యాత్రాస్మ్రతి (ఆత్మకథ),

జ్వాలాలేఖిని (30 కవితలు)

మహా బోధి (కథా కావ్యం)

నవ మంజరి (లలిత గీతాలు)

దాశరథి (బాలగేయాలు)

శంకర్స్ బొమ్మల బాల రామాయణం (కథల సంయుక్త రచన)

శంకర్స్ బొమ్మల బాల భాగవతం (కథల సంయుక్త రచన)

శంకర్స్ బొమ్మల బాల భారతం (కథల సంయుక్త రచన)

తేనెపాటలు (లలిత గీతాలు సంయుక్త రచన)

దాశరథి శతకం (పద్యశతకం)

మహా శిల్పి జక్కన (చారిత్రాత్మక నవల)

ప్రాచీన లక్నో (అనువాద చరిత్ర గ్రంథం)

అమృతవల్లి తెలుగుతల్లి (ఖండ కావ్యం)

బాలసరస్వతి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ

జ్వాలా లేఖిని (ఖండ కావ్యం)

నవజగానికి వందనం (అనువాద కవిత)

జయదేవకృత గీత గోవింద కావ్యం (వ్యాఖ్యానం)

నేత్రపర్వం (ఖండ కావ్యం)

సాఖీనామా (గజళ్ళు, రుబాయిలు)


దాశరథి  గారు సినిమా రంగంలో ప్రవేశించి అజరామరమైన పాటలు రచించారు . 

 ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ , ఇద్దరు మిత్రులు (1961)

నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా, వాగ్దానం (1961) 

అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామి, అమరశిల్పి జక్కన (1964) 

 ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర, డాక్టర్ చక్రవర్తి (1964) 

 గోరంక గూటికే చేరావు చిలకా ; గోరొంక కెందుకో కొండంత అలక, దాగుడు మూతలు (1964) 

గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది, మూగ మనసులు (1964) 

కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా, నాదీ ఆడజన్మే (1964) 

అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు సరదాలు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్, ప్రేమించి చూడు (1965) 

 ఒక పూలబాణం తగిలింది మదిలో తొలిప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే, ఆత్మగౌరవం (1966) 

నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ లేని నాడు మజాలేనే లేదు, నవరాత్రి (1966) 

 ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల, శ్రీకృష్ణ తులాభారం (1966) 

కిలకిల నగవుల నవమోహిని ప్రియకామినీ సాటిలేని సొగసుల గజగామినీ, వసంత సేన (1967) : 

 నీవు రావు నిదురరాదు, నిలిచిపోయె యీ రేయి, పూల రంగడు (1967) 

నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో, నిండు మనసులు (1967) 

 ఈ పుట్టినరోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు, కంచుకోట (1967) 

 తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా, పట్టుకుంటే పదివేలు (1967) 

 కనరాని దేవుడే కనిపించినాడే ; నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో, రంగులరాట్నం (1967) 

 విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు నామదిలో వున్న కోరిక, బంగారు గాజులు (1968) 

 రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా, రాము (1968) 

 విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో, బందిపోటు దొంగలు (1968) 

ఆత్మీయులు (1969) : మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె, ఆత్మీయులు (1969) 

 నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా, బుద్ధిమంతుడు (1969) 

 నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా గెలుపు నాదేలే, భలే రంగడు (1969) 

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా, మాతృ దేవత (1969) 

ఈవేళ నాలో ఎందుకో ఆశలు ; నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే, మూగ నోము (1969) 

పువ్వులో గువ్వలో వాగులో తీవెలో అంతట నీవేనమ్మా అన్నిట నీవేనమ్మా, ఇద్దరు అమ్మాయిలు (1970) 

మంగళగౌరి మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా, చిట్టి చెల్లెలు (1970) 

 పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా, అమాయకురాలు (1971) 

ఆవేశం రావాలి ఆవేదన కావాలి ; ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో, మనసు మాంగల్యం (1971) ఈ గీతాలు 


ఇప్పటి తరాన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి. 

1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 'కవితాపుష్పకం' కవితా సంపుటికి ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రకటించింది

'తిమిరంతో సమరం' కవితాసంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది

ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ" ప్రదానం చేసింది . 

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం "డి. లిట్ " ఇచ్చి గౌరవించింది . 

ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా  1977 నుంచి 1983 వరకు దాశరథి పనిచేశారు . 

మహాకవి దాశరథి కృష్ణమాచార్య జులై 22 , 1925న మహబూబ్ నగర్ చిన  గూడూరు గ్రామం లో దాశరథి వెంకటాచార్య, వెంకటమ్మ దంపతులకు జన్మిచారు . 1987 నవంబర్ 5వ తేదీన తన 62వ సంవత్సరంలో ఇహ లోక యాత్ర ముగించారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు