డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార కార్యక్రమాలను నిర్వహించారు.
నిర్మాత , దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు 2004లో 'ఫిలిం నగర్ దైవ సన్నిధానం ' పేరుతో ఒక దేవాలయాన్ని ఫిలిం నగర్ లో నిర్మించారు. ఈ దేవాలయానికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అక్టోబర్ మొదటి వారంలో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను . మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్టర్ కె .వి. రమణాచారి మాకు సమయం ఇప్పించారు .
ఆరోజు ఉదయం మేము లేక్ వ్యూ కు వెళ్ళాము . రాజశేఖర్ రెడ్డి గారి కోసం హాల్ లో చాలా మంది వేచి వున్నారు .
సరిగ్గా 9.30 గంటలకు మేమున్న హాల్ లోకి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు . అందరినీ కలసి మాట్లాడి పంపించిన తరువాత మా దగ్గరకు వచ్చార . ప్రసాద్ గారిని చూడగానే 'మీతో కాసేపు మాట్లాడాలని , అందరినీ పింపించాను , ఎలా వున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు , మీరు నిర్మించిన సినిమాలు చూసి పెరిగాము 'అని చెప్పారు . ఆ మాటలను రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో సంతోషించారు .
అంతేకాదు జగపతి సంస్థ నిర్మించిన సినిమాల్లోని పాటలను కూడా రాజశేఖర్ రెడ్డి గారు పాడటం విశేషం .
రాజేంద్ర ప్రసాద్ గారు శాలువాతో రాజశేఖర్ రెడ్డి గార్ని సత్కరించారు . దేవాలాయానికి వారిని ఆహ్వానిస్తూ లెటర్ ను నేను అందజేశాను .
అప్పుడు రమణాచారి గారిని పిలిచి 'రమణా , దేవాలయానికి వెళ్ళడానికి ఎప్పుడు వీలవుతుందో చూసి వారికి చెప్పు ' అన్నారు .
ఆ తరువాత అక్టోబర్ 15న రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఫిలిం నగర్ దైవ సన్నిధానం కు విచ్చేశారు . ఆరోజు అక్కినేని నాగేశ్వర రావు గారితో సహా ఎంతో మంది నటీ నటులు , నిర్మాతలు ,దర్శకులు వచ్చారు . రాజశేఖర్ రెడ్డి గారు అరగంటకు పైగా దేవాలయంలో వున్నారు . అన్నట్టు ఆరోజు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు నక్సలైట్స్ తో సమావేశంలో ఉండి కూడా దేవాలయ సందర్శనకు రావడం విశేషం .
అదే సంవత్సరం నిర్మాత , దర్శకుడు వి .బి. రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ను కూడా ప్రకటించింది . ఈ అవార్డును ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రదానం చేశారు .
ఆనాటి జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా వున్నాయి .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి