పోస్ట్‌లు

చిత్రం
                 1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల దా. మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో డా. మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైరాబాద్లోని దసపల్ల హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు  అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.... టైటిల్ చాలా బాగుంది. 1997 తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ....ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు నాకు ఈ కథ చెప్పారు. కథ వినగానే చేయాలని అనిప...
చిత్రం
 జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా - మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్    సినిమా జర్నలిస్టుల సాధక బాధకాలు ఏమిటో తనకు పూర్తిగా అవగాహన ఉందని, వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. "ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్" నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా  అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. ప్రభు, ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస యాదవ్ ను  మర్యాదపూర్వకంగా  కలిశారు. సినిమా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రం ఇచ్చి వివరించారు. "ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్" ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలనుకుంటోందని, దీనికి హాజరు కావాలని కూడా కోరారు. అలాగే ఫిలిం జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యం, గృహవసతి కల్పనకు కూడా కృషి చేయవలసిందిగా కోరారు. దీనికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ.. "చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడి నప్పటి నుంచి సినిమా జర్నలిస్టుల పరిస్థితి ఏమిటో తనకు పూర్తి అవగాహన ఉందని, సిని...
చిత్రం
టోక్యో ఒలింపిక్స్ లో విజేత మన సింధు  భరతమాత నుదుట 'సింధూ ' రం  మన అందరం గర్వించే @Pvsindhu  కు  అభినందనలు   
చిత్రం
 ఈరోజు దాశరధి గారి జయంతి  ఈరోజు మహాకవి దాశరధి గారి 96వ జయంతి . తెలుగు సాహిత్యంలో , సినిమా పాటల్లో దాశరధి గారిది ఓ ప్రత్యేకమైన శైలి .  ఆయన జీవితమంతా విలువల కోసం బ్రతికారు . పదవులు వస్తే స్వీకరించారు తప్ప వాటి కోసం తన ఆత్మ గౌరవాన్ని ఎప్పుడూ  వదులుకొని మంచి మనిషి. నిరాడంబరుడు , నిగర్వి ఈనాటి కవులందరికీ స్ఫూర్తి ప్రదాత దాశరధి గారు . 1987లో జరిగిన నా వివాహానికి దాశరధి గారు వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు . దాశరధి గారితో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు  వున్నాయి . మహాకవి దాశరధి ప్రాతః కాల స్మరణీయులు . 
చిత్రం
 కూతురు తల్లి నిర్మాత  రొమాంటిక్ పాత్రల్లో నటించిన షకీలా చాలా కాలం తరువాత చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చింది. తన కుమార్తె మిలాను హీరోయిన్ గా రెండు చిత్రాలను రూపొందిస్తుంది .  కె.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై   రమేష్ కావలి దర్శకత్వంలో షకీల నిర్మిస్తున్న  "అట్టర్ ప్లాప్", "రొమాంటిక్"  చిత్రాల టైటిల్ పోస్టర్ ను హైదరాబాద్ లో    షకీల విడుదల చేశారు.  తమ్ముడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాల కథలు  నాకెంతో నచ్చాయి..అందుకే అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్ గా నటిస్తుంది.. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాము. ఇక మా సినిమాల కోసంస్వంత  ఓటిటి ని  ప్లాన్ చేశాం. అని చెప్పారు షకీలా .   
చిత్రం
 ఈరోజు రాజేంద్ర ప్రసాద్ 65వ జన్మదినం  హాస్య చిత్రాల కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్ 65వ జన్మ దినం . ఆరోగ్యకరమైన హాస్యానికే చిరునామా,  విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషించే రాజేంద్ర ప్రసాద్ నాకు మంచి మిత్రుడు కృష్ణాజిల్లా నిమ్మకూరులో జులై 19, 1956లో జన్మించిన ప్రసాద్ మహానటుడు ఎన్ .టి .రామారావు గారి ఆశీస్సులతో 1977లో బాపు దర్శకత్వం వహించిన "స్నేహం " సినిమాతో నటుడయ్యారు . 44 సంవత్సరాల తరువాత కూడా రాజేంద్ర ప్రసాద్ విలక్షణమైన పాత్రలను పోషిస్తున్నారు .  ప్రసాద్ ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ---  జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ! 
చిత్రం
              హీరోలకు ఓ. కళ్యాణ్ సవాలు  మా అసోసియేషన్ అంపశయ్యపై ఉంది. 15 ఏళ్ల నుంచి మా లో అలజడి తప్ప అభివృద్ధి లేదు మా ఎన్నికలు వచ్చాయంటే యుద్ధ వాతావరణం ఉంటుంది మా ఎన్నికలు పంచాయతీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయి. మా అసోసియేషన్ సర్వీస్ ఓరియంట్ గా లేదు. 25 ఏళ్లుగా మా అసోసియేషన్ ఎందుకు భవనాన్ని నిర్మించడం లేదు. పద్మాలయ స్టూడియో వెనుక 1000 గజాల స్థలం అప్పటి ప్రభుత్వం ఇస్తే నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడున్న సినీ పెద్దలకు మా అసోసియేషన్ కు 1000 గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా? అని ప్రశ్నించారు. మా అసోసియేషన్ ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాశ్ రాజ్ ఎందుకు ముందుకు వచ్చారు? ప్రశ్నించేవాళ్లు తన చుట్టూ ఉన్నారన్న ప్రకాశ్ రాజ్ ... వాళ్లు ఎంత మందిని ప్రశ్నించారు?.మా ఎన్నికల్లో నేను ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయాను . మద్దతిస్తూ గెలిపించిన వాళ్లు ఎన్నికలు పూర్తవగానే తప్పకుంటున్నారు మా అసోసియేషన్ అల్లరి కాకుండా సినీ పెద్దలు కాపాడండి.నేను ఏ పదవికి పోటి చేయడం లేదు, ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు.మా ఎన్నికలు జరగకుండా పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి మా అసోసియేషన్ భవనానికి నా ఆ...