పోస్ట్‌లు

చిత్రం
  డాక్టర్ కె .వి. రమణాచారి గారు మెచ్చిన "శకపురుషుడు" ఎన్ .టి . ఆర్  శత జయంతి సందర్భంగా ఎన్ .టి .ఆర్.సెంటినరీ కమిటీ "శకపురుషుడు " ప్రత్యేక సంచికను వెలువరించింది . ఈ సంచికలో సినిమా విభాగానికి నేను సంపాదకుడుగా పనిచేశాను .  ఈ సంచిక చాలా బాగుందని , ఎన్ .టి .రామారావు గారికి వారి శతాబ్ది సంవత్సరంలో అపూర్వ నివాళి అని పుస్తకం చూసిన దేశ , విదేశాల్లోని తెలుగు వారంతా ప్రశంసిస్తున్నారు.  "శకపురుషుడు " పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె .వి . రమణాచారి గారికి బహుకరించాను.  రమణ చారి గారు ఆ పుస్తకాన్ని చూసి "నా నలభై ఐదేళ్ల ప్రజా జీవితంలో ప్రత్యేక సంచికలు ఎన్నో చూశాను, అయితే  "శకపురుషుడు" అన్నింటిలో చాలా చాలా ప్రత్యేకం . ఇందులో ఆర్టికల్స్  ఎంపిక , లే అవుట్ ,పేపరు ,  ప్రింటింగ్ అన్నీ సూపర్ , ముఖ్యంగా "శకపురుషుడు " అనే పేరు , కవర్ పేజీ ఎంపిక,  చూడగానే అన్న గారి రాజసం కనిపిస్తోంది. ఇది మహా ప్రసాదంగా భావిస్తున్నాను.  భగీరథా , నిన్ను నలభై నాలుగు  సంవత్సరాలుగా చూస్తున్నా , నువ్వు ఏది  డబ్బు కోణంలో చూడవు , అదే నీ ప్రత్యేకత. శ్రీకృష్ణదేవరా...
చిత్రం
  రికార్డు స్థాయిలో ఎన్ .టి .ఆర్ . స్మారక నాణెం అమ్మకాలు  హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్ .టి .రామారావు గారిది , ఈ నాణెం రెండున్నర నెలల్లో 25, 000 అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త  రికార్డు అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్  వి .ఎన్ .ఆర్ . నాయుడు చెప్పారు.   శనివారం, ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ చైర్మన్ టి,డి .జనార్దన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు వి, ఎన్ .ఆర్ .నాయుడు, శ్రీనివాస్ గండపనేడు , తానాజీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  నాయుడు మాట్లాడుతూ - దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది,  మొదట జవహర్ లాల్ నెహ్రూ , ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేయడం జరిగిందని , అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు రికార్డు అని , ఆ రికార్డు ను ఎన్ .టి .ఆర్ . స్మారక నాణెం బ్రేక్ చేసిందని , ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని , 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు . కేవలం రెండున్నర నెలల్లోనే 25,000 స్మారక నాణేలను విక్రయించడం జర...
చిత్రం
 రామోజీ రావు గారు స్ఫూర్తి ప్రదాత  నవంబరు 16 పద్మవిభూషణ్ రామోజీ రావు గారి పుట్టినరోజు.  86 సంవత్సరాలు పూర్తి చేసుకొని 87వ సంవత్సరంలోకి ప్రవేశించారు .  రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న   వెంకటసుబ్బమ్మ,  వెంకట సుబ్బారావుదంపతులకు జన్మిచారు .  1974 ఆగష్టు 10న రామోజీరావు గారు విశాఖపట్నంలో ఈనాడు దిన పత్రికను ప్రారంభించారు . ఆ తరువాత 1975 డిసెంబర్ 17న హైదరాబాదులో  మరో ఎడిషన్ ప్రారంభించారు . ఈనాడు దేశంలోనే పెను సంచలనం సృష్టించింది .  మార్గదర్శి, ఉషాకిరణ్ మూవీస్, మయూరి ఫిలిమ్స్, రామోజీ ఫిలిం సిటీ మొదలైన సంస్థలను ఆయన ప్రారంభించారు . ఈరోజు ఆయన పేరు ప్రపంచంలోనే ప్రముఖంగా వినిపిస్తుంది .   తెలుగు పత్రికా రంగంలోనూ , సినిమా రంగంలోనూ రామోజీ రావు గారు సరికొత్త చరిత్రను సృష్టించారు. నవ్యతకు , నాణ్యతకు ఆయన మరో పేరు.  రామోజీ  రావు గారితో నేను మొదటిసారి 1983 లో ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి లో పనిచేసేవాడిని .  ఆ తర్వాత మళ్ళీ 1986లో మరొక ఇంటర్వ్యూ చేశాను . ...
చిత్రం
  48 సంవత్సరాల నాటి జ్ఞాపకం, వి.ఎస్. మూర్తి స్మృతి 1971 అక్టోబర్ 17న నేను హైదరాబాద్ కు వచ్చాను . మా పెద్దన్నయ్య కోటేశ్వర రావు హెచ్ .ఎమ్ .టి ఫ్యాక్టరీ లో పనిచేసేవాడు . ఆయన దగ్గర ఉండి ఇంటర్మీడియట్ చదవడానికి మా నాన్న రామస్వామి నన్ను హైదరాబాద్ పంపించారు . . పావులూరు హైస్కూల్ లో చదివే రోజుల్లోనే నేను కథలు , కవిత్వం రాసేవాడిని. తెలుగు మాస్టారు మాధవరావు గారు నన్ను ప్రోత్సహించేవారు హైదరాబాద్ వచ్చాక కూడా చదువుకుంటూ రచనలు చేసేవాడిని. ఇంటర్ లో గురువు ఆచార్య తిరుమల గారు కూడా నన్ను బాగా ప్రోత్సహించేవారు. నేను మొదటిసారి 'ఆహుతి ' అన్న నాటకం వ్రాశాను. 1974 చివరిలో ఆకాశవాణిలో పనిచేసే దండమూడి మహీధర్ గారికి ఈ నాటకాన్ని చూపించాను. ఆయన, టి.వి .ఆర్ .కె . సుబ్బారావు గారిని నాకు పరిచయం చేశారు . అప్పుడు వారు డ్రామా సెక్షన్ చూసేవారు . రెండు నెలల తర్వాత 'ఆహుతి' నాటకం 'ఆకాశవాణి' లో ప్రసారానికి ఎంపికయ్యిందని లెటర్ వచ్చింది . అప్పుడు నేను చిక్కడపల్లి లో ఉండేవాడిని. మా ఇంటికి సమీపంలో కె .ఎస్ .ఆర్ .ప్రసాద్ , వి .ఎస్ .మూర్తి ఉండేవారు . ప్రసాద్ నాకు కాలేజ్ లో పరిచయం . మూర్తి ప్రసాద్ గా...
చిత్రం
 ఈరోజు  సూర్యకాంతమ్మ  శత జయంతి  తెలుగు వారి స్మృతి పథంలో "సూర్యకాంతమ్మ గయ్యాళి అనగానే మనకు గుర్తుకొచ్చే నటి సూర్యకాంతమ్మ. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెరగని, తరగని రూపం ఆమెది. తెరపైన గయ్యాళి పాత్రలను అద్భుతంగా పోషించే సూర్యకాంతమ్మ లో మానవతా కోణం కూడా ఉందని చాలా మందికి తెలియదు . ఆపదలో వున్నవారిని ఆర్ధికంగా ఆదుకునే మంచి నటి సూర్యకాంతమ్మ. సినిమా రంగంలో అందరు అభిమానిగా ,ఆత్మీయంగా 'అమ్మా ' అని పిలుస్తారు .  సూర్యకాంతమ్మ, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలోని వెంకటకృష్ణరాయ పురం గ్రామంలో పొన్నాడ అనంతరామయ్య , శ్రీమతి వెంకట రత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా 28 అక్టోబర్ 1924న జన్మించారు .  పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు , అందుకు నిదర్శనం సూర్యకాంతం . ఆరు సంవత్సరాల లేత ప్రాయంలోనే పాడటం , నృత్యం చేయడం మొదలు పెట్టింది. సినిమాలు చూస్తూ పెరిగిన సూర్యకాంతం లో నటిని కావాలన్న కోరిక బలంగా పెరుగుతూ వచ్చింది. తల్లితండ్రులు కూడా కుమార్తె ను ప్రోత్సహించారు .   1944వ సంవత్సరం ఆమె మద్రాసు మహానగరంలో అడుగుపెట్టారు . అప్పుడామె వయసు  20 సంవత్సరాలు. కథానాయికకు ...
చిత్రం
  అమెరికా  సదస్సులోవంగూరి చిట్టెన్ రాజుకు 'మహా పురస్కారం ' ఈనెల  21, 22,  తేదీలలో  అమెరికాలోని కాలిఫోర్నియా  జరిగిన  లో 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో వంగూరి చిట్టెన్ రాజు గారిని   సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు కనకాంబర పుష్పభిషేకంతో  వారిని వేదిక మీదకి ఆహ్వానించి ఘనంగా  సత్కరించారు. అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తరుపున  “మహా పురస్కారం”  మొట్ట మొదటిసారి వంగూరి చిట్టెన్ రాజు గారికి ప్రదానంచేస్తున్నట్టు ప్రకటించారు . తెలుగు సాహిత్యానికి , సాంస్కృతికి చిట్టెన్ రాజు గారు చేస్తున్న సేవలను గుర్తుంచి వారిని  “బంగారు ఏనుగు” తో ఘనం గా సత్కరించారు మిల్పిటస్ నగరం, (కాలిఫోర్నియా) లో 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ద్గ్విజయంగా జరిగింది. అమెరికాలో అన్ని నగరాలనుంచీ, కెనడాలో టొరంటో, ఆటవా, వాంకూవర్ నగరాల నుంచీ, అటు భారత దేశం నుంచీ సుమారు 150 మంది సాహితీవేత్తలు ఈ రెండు రోజుల సాహిత్య సమావేశం లో పాల్గొని తమ ప్రసంగాలని వినిపించారు. ముందు రోజు..అనగా శుక్రవారం, అక్టోబర్ 20 నాటికి మిల్పిటస్ చేరుకున్న సాహితీవేత...
చిత్రం
 One Milian views : 1,000,000 మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి హోదాలో ఎన్.టి. రామారావు మద్రాసులో జరిగిన వివాహ వేడుకకు హాజరై ఇతర అతిథులతో కలిసి భోజనం చేశారు. మా శైలి అండ్ శైలి యూట్యూబ్ ఛానల్ లో " అప్పటి ముఖ్యమంత్రి ఎన్ . టి. రామారావు  వివాహ భోజనం" అనే  ఈ వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది అరుదైన మరియు అపూర్వమైన  విజయం. మీ అందరికీ కృతజ్ఞతలు .