అపోహలు వద్దు టీకానే ముద్దు
ఆదివారం ఉదయం 10 గంటలకు జూబిలీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి కోవి షీల్డ్ వాక్సినేషన్ రెండవ డోస్ తీసుకున్నాము .
నేను నా భార్య శ్రీమతి ఝాన్సీ రాణి , మా వియ్యంకుడు జాస్తి రాధాకృష్ణ మూర్తి గారు , శ్రీమతి సత్యవతి గారు నలుగురం
వాక్సినేషన్ రెండవ డోస్ తీసుకున్నాము .
మొదటి డోస్ మార్చి 1వ తేదీన కోవి షీల్డ్ టీకా ఇదే ఆసుపత్రిలో తీసుకున్నాము . ఆదివారం కావడం వల్ల మేము వెళ్ళినప్పుడు పెద్దగా జనం లేరు . 15 నిమిషాల్లోరిజిస్ట్రేషన్ , ఆ వెంటనే టీకా వేశారు . 15 నిమిషాలు అక్కడ హాల్ లో కూర్చున్నాము . మా నలుగురికీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు. .
మొదటి సారి కన్నా రెండవసారి మందు డోస్ పెంచారు.
మళ్ళీ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ టీకా తీసుకోవడం చాలా అవసరం, అనివార్యం .
అయితే చాలా మందిలో వాక్సినేషన్ గురించి అపోహలు, అనుమానాలు వున్నాయి . వాటిని పక్కన పక్కన పెట్టి అందరూ కూడా టీకా తీసుకొని నిశ్చింతగా ఉండండి !.
Comments
Post a Comment