
స్నేహపాత్రుడు ఆర్ .ఆర్ .వెంకట్ ఈరోజు హైద్రాబాద్ లో మరణించిన ఆర్ .ఆర్. వెంకట్ ( జె .వి .ఫణింద్ర రెడ్డి ) స్నేహపాత్రుడు . సినిమా అంటే ఎంతో అభిమానం . అయితే సినిమా ప్రచారానికి ఆయన దూరంగా ఉండేవారు . ఆయన మొదటి సినిమా "ది ఎండ్ ". రవి చావలి దర్శకత్వం వహించారు . ఈ సినిమాకు అప్పటి రాష్ట్రపతి నుంచి ప్రశంసాపత్రం లభించింది . 2004లో ఎస్ .వి .కృష్ణా రెడ్డి దర్శకత్వంలో , కె . అచ్చి రెడ్డి సారథ్యంలో అలీ , వేణుమాధవ్ తో "హంగామా " అనే చిత్రం నిర్మించారు . ఆ సినిమాకు పబ్లిసిటీ నన్ను చెయ్యమని అచ్చి రెడ్డి గారు అడిగారు . నేను అంగీకరించాను . ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ లో జరిగేటప్పుడు నిర్మాత వెంకట్ గారు వచ్చారు . ఆయన్ని అచ్చి రెడ్డి గారు నాకు పరిచయం చేశారు . ఆ తరువాత ఆయన నిర్మించిన "మాయాజాలం" , సినిమాకు కూడా నేను పనిచేశాను . ఆయన కాంట్రాక్టర్ . ఎక్కువ రోజులు ఉత్తర భారతంలో ఉండేవారు . హైదరాబాద్ వస్తే మాత్రం కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి తో పాటు నన్ను కలిసేవారు . అప్పుడు ఆర్ .ఆర్ మూవీ మేకర్స్ కార...