సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ ?
ఈ వార్త ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. దాదా సాహెబ్ ఫాల్కే , పద్మవిభూషణ్ రజినీకాంత కేవలం తమిళనాటికే పరిమితం అయిన నటుడు కాదు , తెలుగు , తమిళ , కన్నడ, మలయాళం , బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగారు .
రజనీకాంత్ తన ఆత్మకథను రాస్తున్నారని వార్త ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఆసక్తిని కలిగిస్తుంది.
రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. మరాఠాల చక్రవర్తి ఛత్రపతి శివాజీ అంటే ఆయన తల్లిదండ్రులకు ఇష్టం .అందుకే ఆయనకు ఆ పేరు పెట్టారు. రజినీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ . ఆయన పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర, పుణె సమీపంలోని మావడి కడెపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. రజినీకాంత్ చిన్నవాడు. తండ్రి రామోజీరావు పదవీ విరమణ చేసిన తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది.
రజనీకాంత్ బస్ కండక్టర్‌గా జీవితాన్ని మొదలు పెట్టాడు .
టోపి మునియప్ప అనే రచయిత తన నాటకాలలోఅవకాశం కల్పించాడు . తర్వాత నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. అదే సమయంలో మద్రాస్ నగరంలో కొత్తగా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమవుతుందని తెలుసుకున్నాడు . ఎలాగైనా అందులో చేరి శిక్షణ తీసుకోవాలనుకున్నాడు . అయితే ఆర్ధిక ఇబ్బదులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు . అప్పుడు తన స్నేహితుడు, సహోద్యోగీ రాజ్ బహదూర్ రజనీకి సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చాడు . అలా రజనీ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరాడు .
ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ సమయంలో దర్శకుడు కె.బాలచందర్ అతని ప్రతిభను స్వయంగా చూశాడు .
1975 లో రూపొందిన 'అపూర్వ రాగంగళ్' అనే చిత్రంలో బాలచందర్ అతన్ని పరిచయం చేశాడు . అప్పటికీ తమిళనాట ప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ ఉండటంతో శివాజీ గైక్వాడ్ పేరును రజనీకాంత్ గా మార్చాడు.
ఆ తరువాత బాల చందర్ తెలుగులో 'అంతులేని కథ ' సినిమాను రూపొందిస్తూ రజనీకాంత్ కు అవకాశం ఇచ్చాడు . ఈ సినిమా కూడా విజయం సంధించింది . ఆ తరువాత సంవత్సరం 1977లో తెలుగు , తమిళం, కన్నడ భాషల్లో 15 చిత్రాల్లో రజనీకాంత్ నటించాడు .
అప్పటి నుంచి ఆయన సినిమా రంగంలో జైత్రయాత్ర మొదలయ్యింది . ఇప్పటి వరకు 160 చిత్రాల్లో నటించారు .
ఆయన నటించిన సినిమాలు 500 నుంచి 600 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. 75వ ఏట కూడా రజనీకాంత్ క్రేజ్ తగ్గలేదు .
భారతీయ చలనచిత్ర చరిత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ప్ర కు ఓ ప్రత్యేకమైన స్తానం ఉంది . ఆయన సినిమా ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం .
రజనీకాంత్ ఆత్మకథ రాస్తున్నారని వార్త ఎంత సంచలనం కలిగిస్తుందో , అంతకంటే ఆ ఆత్మ కథ చిత్రంగా రాబోతుంది వాత మరింత సంచలనం కలిగిస్తుంది. ఇది తమిళ సినిమా రంగంలో వినిపిస్తున్న వార్త. అయితే దీన్ని రజనీకాంత్ అధికారికంగా ప్రకటించలేదు .
రజనీకాంత్ ఆత్మకథ లో అనేక ఆసక్తికమైన సంఘటనలు ఉంటాయని, ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం కూడా మిళితమై వుంటాయని తెలుస్తుంది .
అయితే తన జీవిత కథ ను సినిమాగా నిర్మిస్తే ఎలా ఉంటుందని రజనీకాంత్ తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తుంది .
రజనీకాంత్ కుమార్తె సౌందర్య తన తండ్రి రజనీకాంత్ 'ఆత్మకథ' రాస్తున్నారని ఇటీవల తెలిపారు.
"రజనీకాంత్ జీవన ప్రస్థానానికి సంబంధించిన పూర్తి సమాహారం ఈ ఆత్మకథ లో ఉంటుందని , ఆయన తన సినిమా జీవితంలో
ప్రతి పాత్ర పోషణ కోసం చేసిన కృషి అనన్య సామాన్యమనీ , ఈ ఆత్మ కథలో మరెన్నోఅద్భుతాలు ఉంటాయని ,ఈ పుస్తకం విడుదల తరువాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించే అవకాశం ఉందని " సౌందర్య తెలిపారు .
రజనీకాంత్ ను తమిళనాడు ప్రభుత్వం కలైమామణి, ఎమ్ .జి .ఆర్. పురస్కారంతో సత్కరించింది . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్ .టి .ఆర్ . జాతీయ అవార్డు తో గౌరవించింది .56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రజనీకాంత్ ను 'సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'తో ఘనంగా సత్కరించారు .
పద్మ భూషణ్, పద్మ విభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో భారత ప్రభుత్వం రజనీకాంత్ ను గౌరవించింది .


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి