ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం

ఎన్ .టి. ఆర్. లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం జరిగింది.  1984 ఆగష్టు 16న లో ఎన్ .టి .ఆర్ . ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన్ని దింపి నాదెళ్ల భాస్కరరావు ను ముఖ్యమంత్రి గా చేశారు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ . ఈ చర్య దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పించింది . దేశంలో వున్నా ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉద్యమించాయి . శ్రీమతి ఇందిరాగాంధీ దిగివచ్చి మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు . నెల రోజుల తరువాత సెప్టెంబర్ 16న రామారావు గారు  ముఖ్యమంత్రిగా పదవీ ఓరామానా స్వీకారం చేశారు . అప్పటి గవర్నర్ రామ్ లాల్ ను మార్చి  శాఖదర్ శర్మ గానిని నియమాయించారు . శర్మ గారు రామారావు గారితో ప్రమాణం చేయించారు . ఆరోజును అంటే సెప్టెంబర్ 16ను ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించారు . అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.  


ఈ సంవత్సరం ఎన్ .టి. ఆర్. లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ  అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన శ్రీమతి ప్రతిభాభారతి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, అన్న ఎన్ .టి .ఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ,ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ , నేను పాల్గొన్నాము . 


శ్రీమతి ప్రతిభా భారతి , మోత్కుపల్లి నరసింహులు , జనార్దన్ , రామకృష్ణ నాన్నగారితో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు . 

ఈ ఉద్యమానికి నేను ప్రత్యక్ష సాక్షిని . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నాను . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు