కందుల దుర్గేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు .
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి జన్మదినోత్సవం .
కందుల దుర్గేష్ గారు ఒకప్పుడు ఈనాడు నుంచి వెలువడే సితార సినిమా వారపత్రికలో రిపోర్టర్ గా పనిచేసేవారు . నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక లో పనిచేసేవాడిని . అప్పటి నుంచి దుర్గేష్ గారితో నాకు పరిచయం వుంది.
తరువాత దుర్గేష్ గారు రాజకీయాల్లో ప్రవేశించి అదీ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా ఉండటం మా అందరికీ గర్వకారణం .
గత సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది రోజు నాకు కళారత్న పురస్కారం ప్రదానం చేసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు , సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి నుంచి ఈ పురస్కారం స్వీకరించాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారితో "నేను జర్నలిస్టుగా వున్నప్పటి నుంచి భగీరథ గారు పరిచయం "అని దుర్గేష్ గారు చెప్పారు .
"నాకు కూడా భగీరథ గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసు " అని బాబు గారు దుర్గేష్ గారు చెప్పడం నాకు ఆనందాన్ని కలిగించింది .
దుర్గేష్ గారు ఇలాటి పుట్టినరోజు పండుగలు మరెన్నో చేసుకోవాలి. సినిమా రంగాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి