ఎన్ .టి .ఆర్ తో అపురూప జ్ఞాపకం 

1991లో ఎన్ .టి.ఆర్ నటించి, దర్శకత్వం వహించిన  "బ్రహ్మర్షి విశ్వామిత్ర" చిత్రం షూటింగ్ హైదరాబాద్ నాచారం లోని రామకృష్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఆ షూటింగ్ కవర్ చెయ్యడానికి జ్యోతి చిత్ర రిపోర్టర్ గా నేను బయలుదేరుతుంటే ఆంధ్ర జ్యోతి సీనియర్ 

రిపోర్టర్ ఎల్. రామానాయుడు కూడా  వస్తానన్నాడు . మాతో ఫోటోగ్రాఫర్ కూడా వచ్చాడు . రామారావు గారు అప్పుడు ప్రతిపక్షంలో వున్నారు . 

రామారావు గారిని కలిస్తే ఏమైనా వార్త రాసుకోవచ్చని రామానాయుడు గారి ఆలోచన .  రామారావు గారి  సినిమా షూటింగ్ అంటే పాఠకులకు చెప్పలేనంత ఆసక్తి. పైగా అది వారి స్వంత సినిమా. రామారావు గారి సినిమా షూటింగ్ కవర్ చెచెయ్యాలంటే వారి అనుమతి తప్పనిసరి.  సినిమా షూటింగ్ కోసం ఒక్క పత్రికకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే సినిమా వార పత్రిక జ్యోతి చిత్ర. అందుకే మాతో పాటు ఆంధ్ర జ్యోతిని కూడా అనుమతించారు. రామారావు గారు ఆహ్వానిస్తే ఎంతో ప్రత్యేకంగా చూస్తారు . ఇక వారి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ?  మనకు కావలసిన పూర్తి సమాచారం స్వయంగా ఇస్తారు. సినిమా  ఫోటోలకు కూడా తగిన సమయం కేటాయిస్తారు . పైగా జ్యోతి చిత్ర అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం . జ్యోతి చిత్ర తొలి సూపర్ స్టార్ . 


ఆరోజు రామారావు గారికి షూటింగ్ లేదు . ఆయన దర్శకుడుగా కెమెరామన్ నందమూరి మోహన్ కృష్ణ గారికి సూచనలు ఇస్తున్నారు .

మమల్ని చూడగా ఆప్యాయంగా ఆహ్వానించారు . షూటింగ్ మధ్యలో మాతో అనేక విషయాల గురించి మాట్లాడారు .

మీరు చూస్తున్నది ముప్పై ఐదు సంవత్సరాలనాటి  అపురూప జ్ఞాపకం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు