ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 

ఈరోజు ముఖ్యమంత్రి అనుముల  రేవంత్  రెడ్డి గారి 57వ పుట్టినరోజు .

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబరు 7వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆనతికాలంలోనే ముఖ్యమంత్రిగా మంచి పేరు సంపాదించారు . 


రేవంత్ రెడ్డి గారిని 2022 సంవత్సరం జూన్ లో మొదటిసారి జూబిలీహిల్స్ లోని వారి నివాసంలో మిత్రుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి గారితో కలవడం జరిగింది.  నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా నేను రచించిన 'మహానటుడు - ప్రజానాయకుడు ,ఎన్.టి.ఆర్' అనే పుస్తకాన్ని అప్పుడు బహుకరించాను . 

రెండవసారి గద్దర్ అవార్డుల కమిటీ సభ్యుడుగా రిపోర్ట్ ఇవ్వడానికి 2025 మే 28న వారి నివాసంలో కలవడం జరిగింది . ఆరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి. ఆ సందర్భంగా నెందు సంపాదకత్వం వహించిన 'తారకరామం 'అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహుకరించాను . వారు చాలా సంతోషించారు . రామారావు గారంటే తనకు చాలా అభిమానమని చెప్పారు .



ఈరోజు రేవంత్ రెడ్డి గారి జన్మదినం, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు