పోస్ట్‌లు

చిత్రం
          మోడీకి బాసటగా రిషి సునాక్  ఈనెల 9,10 తేదీల్లో న్యూ ఢిల్లీలో జరిగిన జి . 20 సదస్సు అనూహ్యంగా విజయవంతం అయ్యింది. ప్రపంచంలో భారత దేశం ప్రతిష్ట బాగా పెరిగింది . ప్రధాని నరేంద్ర మోడీ దూర ద్రుష్టి , సమర్ధత తో పాటు  తెర వెనుక సహకారాన్ని అందించిన ఓ దేశ ప్రధాని గురించి ఇప్పుడు పలు కథనాలు వెలువడుతున్నాయి .   జి 20 సదస్సులో అమెరికా , బ్రిటన్ , అస్ట్రేలియా , బ్రెజిల్ ,కెనడా ,చైనా ,ఫ్రాన్స్, జర్మనీ ,ఇండినేషియా , ఆర్జెంటినా ,ఇటలీ ,జపాన్ ,మెక్సికో , దక్షిణ కొరియా , రష్యా ,సౌదీ అరేబియా , దక్షిణాఫ్రికా , టర్కీ ,యూరోపిన్ కౌన్సిల్ అధ్యక్షుడు , యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు పాల్గొన్నారు .  ఇక ఈ సదస్సులో ప్రత్యేక అతిధులుగా బాంగ్లాదేశ్ , ఈజిప్ట్ , మారిషస్ , నెథర్లాండ్ , సింగపూర్ ,ఒమన్ , నైజిరియా , స్పెయిన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాది నేతలు పాల్గొన్నారు .  ఇందరు హేమాహేమీలు పాల్గొన్న ఈ జి 20 సదస్సు విజయంలో కీలక పాత్ర వహించింది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ . ఈ ఇద్దరూ మన ప్రధాని నరేంద్ర మోడీ కి అన్ని విధాలుగా తమ స...
చిత్రం
                  అసలు సిసలు హీరో రజనీకాంత్  తెర మీదనే కాదు నిజ జీవితంలో కూడా   హీరో అని నిరూపించుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ .  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు దేశంపార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖమంత్రి నారా చంద్ర బాబు నాయుడును రాజకీయంగా దెబ్బతీయడానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి జైల్లో పెట్టింది . దీనిపై చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వల్ల ఆర్ధికంగా  లాభపడ్డ వారు, రాజకీయంగా ఎదిగినవారు తెలుగు సినిమా  రంగంలో చాలా మంది వున్నారు . కానీ , చంద్ర బాబుపై అక్రమ కేసు బనాయించారని అటు ప్రధాన మీడియా ,ఇటు సోషల్ మీడియా , జాతీయ మీడియా సైతం ప్రభుత్వాన్ని , సి .ఐ .డి ని , వెనుకనుండి నడిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నాయి.  అయినా మన సినిమా హీరోలు చంద్ర బాబు నాయుడు అరెస్ట్ నిరసన వ్యక్తం చెయ్యలేదు. ట్విట్టర్ లో తెలుగు దేశం వారికి ధైర్యం చెప్పలేదు . చంద్ర బాబు నాయుడు కుమారుడు లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడలేదు  ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేశ్ తో ఫోన్ లో మాట...
చిత్రం
                                  'గాయం' 100 రోజుల వేడుక ఈరోజు అందాల నటి శ్రీదేవి 60వ జయంతి. జర్నలిస్టుగా ఆమెతో నాకు పరిచయం వుంది , అనేక ఇంటర్వ్యూలు కూడా చేశాను. భారతీయ తెర మీద చెక్కుచెదరని అపురూప, అద్వితీయ నటి శ్రీదేవి. 30 సంవత్సరాలనాటి ఓ జ్ఞాపకం . రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన 'గాయం ' సినిమా లో హీరో జగపతి బాబు , రేవతి , ఊర్మిళ నాయికలు . ఈ సినిమా 22 ఏప్రిల్ 1993లో విడుదలై ఘన విజయం సాధించింది .   ఆగస్టులో 'గాయం ' సినిమా శతదినోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని మొదటి ఫ్లోర్ లో వైభవంగా జరిగింది . అప్పట్లో రామ్ గోపాల వర్మ చిత్రాల పబ్లిసిటీ నేను చూసేవాడిని . 'గాయం' సినిమా శతదినోత్సవ వేడుకకు శ్రీదేవిని ముఖ్య అతిథి గా వచ్చి జ్ఞాపికలను అందించారు . శ్రీదేవి నుంచి 'గాయం ' మెమొంటో ను స్వీకరించినప్ప్పటి ఫోటో . 1991లో రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ , శ్రీదేవితో 'క్షణం క్షణం ' సినిమా రూపొందించారు . ఆ పరిచయంతో రామ్ గోపాల్ వర్మ ఆహ్వానించగానే శ్రీదేవి ఈ కార్యక్రమానికి వచ్చారు . ...
చిత్రం
                     ఆకాశవాణిలో నా జీవన ప్రస్థానం  నా వృత్తిజీవిత ఆరంభంలో నన్ను ఆర్ధికంగా నిలబెట్టింది ఆకాశవాణే” అంటున్న సీనియర్ సినీ పాత్రికేయులు రచయిత, పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత భగీరథ గారితో గోపీచంద్ మాటామంతి తెలంగాణ రాష్ట్రంలోని ఆకాశ వాణి కేంద్రాలు ప్రసారం 10 జులై 2023న ప్రసారం చేశాయి . 
చిత్రం
" ఎన్. టి. ఆర్. విగ్రహం భావితరాలకు స్ఫూర్తి " - టి .డి .జనార్దన్ తెలుగువారి ఆరాధ్య నటుడు, మహా పురుషుడు ఎన్ .టి .రామారావు గారి శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగడం, ఆయన పట్ల ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని అభిమానానికి నిదర్శనమని చెప్పవచ్చు. అన్నగారి శత జయంతి వేడుకల్లో మా కమిటీ భాగస్వామి కావడం, వారి స్ఫూర్తి ఎప్పటికీ ఉండేలా కార్యక్రమాలను చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చైర్మన్ టి .డి జనార్దన్ చెప్పారు ఈరోజు ఫిలింనగర్ లోని నిర్మాతల మండలి హాలులో మీడియా సమావేశం ఏర్పాటు చేశాము. జనార్దన్ గారు అమెరికా వెళ్లి వివిధ నగరాల్లో పర్యటించి అన్నగారి శతాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు . ఆ వివరాలను మీడియా కు తెలిపారు . 'మేము ఏ ముహూర్తాన అన్నగారి శత జయంతి వేడుకలు తలపెట్టామో , అవి నిర్విఘ్నంగా , నిరాటంకంగా మన దేశంలోనే కాదు అమెరికాతో పాటు మిగతా దేశాల్లో జరగడం అన్న గారు దైవంశసంభూతుడని రుజువు చేశాయి . అన్నగారి ఉపన్యాసాలను, శాసన సభ ప్రసంగాలు , చారిత్రిక ప్రసంగాలు పేరుతో రెండు గ్రంధాలను ప్రచురించాము . ఆ పుస్తకాలను విజయవాడ లో జరిగిన సభలో విడుదల చేశాము . ఆ సభతో మా కమిటీ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్త...
చిత్రం
                             4 5 సంవత్సరాల నాటి అరుదైన ఫోటో తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెర పై చూపించిన గొప్ప సినిమా 'మాభూమి '. ఇది గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. బి.నరసింగ రావు , జి .రవీంద్రనాథ్ ఈ సినిమాను రూపొందించారు . ఇందులో సాయి చంద్ ,భూపాల్ రెడ్డి , రామ్ రెడ్డి, బి , నరసింగ రావు, తెలంగాణ శకుంతల , ప్రదీప్ శక్తి ,కాకరాల , గద్దర్ మొదలైన వారు నటించారు . 'బండెనక బండి కట్టి, పదహారు బళ్ళు కట్టి ఈ బండ్లో వస్తావు ..' పాటను గద్దర్ పాడటమే కాదు ఇందులో నటించారు . ఈ పాట చిత్రీకరణ ప్రజ్ఞాపూర్ లో జరిగింది . పా ట చిత్రీకరణ పూర్తి అయిన తరువాత నిర్మాత ,నటుడు నరసింగ రావు , భూపాల్ రెడ్డి , గద్దర్ కలసి తీయించుకున్న ఫోటో ఇది. 'మా భూమి ' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా హైదరాబాద్ శ్రీ సారథి స్టూడియోస్ లోనే జరిగింది . అప్పుడు నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా ఆ సినిమా వార్తలు కవర్ చెయ్యడానికి వెళ్ళేవాడిని . అప్పుడు నరసింగ రావు గారు గద్దర్ ను నాకు పరిచయం చేశారు. ఆ అప్పటి నుంచి నరసింగ రావు , గద్దర్ అనుబంధ...
చిత్రం
                    జగదీష్ ప్రసాద్ గారికి 'శకపురుషుడు' ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భగా మేము వెలువరించిన 'శకపురుషుడు ' ప్రత్యేక సంచికను ఒకప్పటి ఆంధ్ర జ్యోతి  మేనేజింగ్ డైరెక్టర్ కానూరి జగదీష్ ప్రసాద్ గారికి బహుకరించాను . 'శకపురుషుడు ' ప్రత్యేక సంచిక సినిమా విభాగం నా  సంపాదకత్వంలో వచ్చిందని చెప్పగానే,  'చాలా మంచి ప్రయత్నం '. ఎప్పటికీ నిలిచిపోయే పుస్తకం . చాలా బాగుంది . కంగ్రాట్యులేషన్స్'   అన్నారు .  ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడిన  జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక లో నేను 12సంవత్సరాలు పనిచేశాను . అప్పటి అనుభవాలన్నీ ఇద్దరం గుర్తుచేసుకున్నాము . జగదీష్ ప్రసాద్ గారు నన్ను ఒక ఉద్యోగి లా కాకుండా స్నేహితుడుగా చూసేవారు . ఆంధ్ర జ్యోతి లో పనిచెయ్యడం వల్లనే నేను ఎదిగానని భావన నాలో వుంది . అందుకే నేను ఎన్ .టి .రామారావు గారి శతాబ్ది సందర్భంగా రచించిన 'మహానటుడు ,ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ ' అన్న పుస్తకాన్ని అంకితం ఇచ్చాను .