Posts

Showing posts from May, 2021
Image
               ఈరోజు దర్శకుడు కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు   నటుడు , సంగీత దర్శకుడు , దర్శకుడు ఎస్ .వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు .  కృష్ణారెడ్డి గారు దర్శకుడుగా ప్రతిభావంతుడే కాదు ప్రభావశీలి కూడా , ఆరోగ్యకరమైన సినిమాలకు కృష్ణా రెడ్డి గారు మారు పేరు .  సౌమ్యుడు , నిరాడంబరుడు, నిగర్వీ అయిన కృష్ణారెడ్డి గారు నా "భగీరథ పథం ", "భారతమెరికా " పుస్తకావిష్కరణ సభల్లో పాల్గొన్నారు.  కృష్ణారెడ్డి గారు ఇంకా ఎన్నో పుట్టినరోజు పండుగలు ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటున్నా  .  
Image
  నాలుగు దశాబ్దాల క్రితం "మానవత" ను ఆవిష్కరించిన శ్రీ శ్రీ . సరిగ్గా 41 సంవత్సరాలక్రితం ఇదే రోజు జూన్ 1, 1980న హైదరాబాద్ అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో నేను రచించిన "మానవత" కవితా పుస్తకానికి మహాకవి శ్రీ శ్రీ గారు ముందు మాట వ్రాసి స్వయంగా మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు . శ్రీ శ్రీ గారిని మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకవచ్చింది నిర్మాత దర్శకులు యు . విశ్వేశ్వర రావు గారు. విశ్వేశ్వర రావు గారు వచ్చేటప్పుడు విమానంలో ఇచ్చిన హిందూ దిన పత్రికను తనతో పాటు తీసుకవచ్చారు . ఆయన ప్రసంగించడానికి ముందు సభలో హిందూ దినపత్రికను చూపించి అందులో ఓ ప్రకటన చదివి వినిపించారు . అందులో Bhageeradha- He Brought the ganga down to earth to purify the souls of sinners.అని వ్రాసి వుంది . ఇదే రోజు నేను వ్రాసిన కవితా పుస్తకం ఆవిష్కరించడం గురించి విశ్వేశ్వర రావు ప్రస్తావించి "మానవత "తో భగీరథ సాహిత్య ప్రపంచంలో అడుగుపెడుతున్నారు అని వారు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు . ఇక ఈ సభలో ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు, ఆచార్య తిరుమల గారు, జి .ఎస్ వరదా చార...
Image
                                పద్మభూషణ్ కృష్ణ గారి 78వ పుట్టినరోజు  ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి  78వ పుట్టినరోజు . సంచలనాలకు మరో పేరు , సాహసాలకు మారు పేరు హీరో కృష్ణ.  1965లో ఆదుర్తి సుబ్బారావు గారు " తేనెమనసులు " చిత్రం తో సినిమా రంగంలోకి హీరోగా పరిచయం అయ్యారు .  కృష్ణ గారు నటించిన చివరి సినిమా ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన "శ్రీ శ్రీ ". ఈ ఐదు దశాబ్దాల్లో కృష్ణ గారు 346 సినిమాల్లో నటించారు .  కృష్ణ గారు నన్ను బాగా అభిమానించేవారు . జర్నలిస్టుగా ఆయన్ని తరచుగా కలుస్తూ ఉండేవాడిని. ఆరోజుల్లో సాయంత్రంవేళ పద్మాలయ స్టూడియోస్ కు వచ్చి రెండు గంటల పాటు కూర్చునేవారు . ఆ సమావేశానికి చాలామంది నిర్మాతలు , దర్శకులు , నటులు హాజరయ్యేవారు . వచ్చిన వారందరికి కృష్ణ గారి సోదరుడు హనుమంతరావు గారు అతిథి మర్యాదలు చూసేవారు . అప్పట్లో నేను కూడా తప్పకుండా పద్మాలయా వెళ్లి కృష్ణ గారి సమావేశాల్లో పాల్గొనేవాడిని . సినిమా రంగానికి సంబంధించిన అనేక విషయాలు తెలుస్తూ ఉండేవి . ఆయన దాపరికం లేకుండా అన్నీ సంగతులు మాట...
Image
                    ఈరోజు దాసరి నారాయణ రావు గారి వర్దంతి  దర్శకరత్న డాక్టర్ నారాయణ రావు గారి ఐదవ వర్దంతి . అప్పుడే  ఆయన మరణించి నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి .  తెలుగు సినిమా రంగానికి పెద్దన్నగా , కొండంత అండగా వుండే దాసరి నారాయణ రావు గారు లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది .  కార్మిక సోదరులంతా మా మేస్త్రి గారు అని ఆప్యాయంగా పిలుచుకునే దర్శక రత్న మే 4, 1942లో జన్మించారు. . 2017 మే 30న చనిపోయారు . తెలుగు సినిమా రంగంలోకి ఒక వ్యక్తిగా ప్రవేశించి వ్యవస్థగా ఎదిగి ఒదిగిన అసమాన్యుడు దాసరి గారు.  దాసరి గారి స్మృతి కి నీరాజనం . 
Image
 మహానటుడు ఎన్ .టి .ఆర్ తో మధుర స్మృతులు మహానటుడు , ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి .  రామారావు గారితో జర్నలిస్టుగా ఎన్నో మర్చిపోలేని మధుర స్మృతులున్నాయి .  సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు .  1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రకటించారు . హైదరాబాద్ లోని గోల్కొండ క్రాస్ రోడ్ లో వున్న రామకృష్ణ స్టూడియోస్  తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలకు ప్రధాన వేదిక. ఎప్పుడూ జనంతో కళకళలాడుతూ ఉండేది . అయితే పార్టీ ప్రారంభమైన తరువాత  అన్నగారు తప్పనిసరి పరిస్థితుల్లో "నా దేశం 'అనే సినిమా చెయ్యవలసి వచ్చింది . కె .దేవీ వరప్రసాద్ ,ఎస్ .వెంకటరత్నం నిర్మించిన ఈ సినిమాకు కె . బాపయ్య దర్శకుడు .  నేను జ్యోతి చిత్ర వారపత్రిక లో రిపోర్టర్ గా వున్నప్పుడు రామారావు గారి పుట్టిన రోజు పండుగకు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవాడిని . అలాగే 1982 మే 28 ఇంటర్వ్యూ  కోసం రామారావు గారిని మే 13న రామకృష్ణ స్టూడియోస్ లో కలిశాను . అప్పుడు "నాదేశం " చిత్రం షూటింగ్ లో వున్నారు.  జ్యోతి చిత్రకు  కోసం మీ ఇంటర్వ్యూ కావాలి అని అడి...
Image
                      ఈరోజు వేటూరి సుందర రామమూర్తి  గారి వర్ధంతి  వేటూరి వారు మన మధ్య లేకపోయినా వారి  పాట  తెలుగు  సినిమా పూతోటలో ఎప్పటికీ మరిమళిస్తూనే ఉంటుంది.  జర్నలిస్టుగా జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత సినిమా పాటల రచయితగా అటు క్లాస్ ఇటు మాస్ ను మెప్పించిన  మహాకవి వేటూరి .సుందర రామమూర్తి .  వేటూరి గారిని తలచుకోగానే 25 సంవత్సరాల నాటి ఓ మధురమైన సంఘటన గుర్తుకొస్తుంది .  1996లో మిత్రులు ప్రసాద్ రెడ్డి, అంజి రెడ్డి నిర్మాతలుగా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన "ప్రియమైన శ్రీవారు " సినిమాకు  వేటూరి గారితో ఓ పాట వ్రాయిద్దామని మిత్రుడు , సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నాతో చెప్పాడు . తప్పకుండా వ్రాయిద్దాం అని చెప్పాను . ఈ సినిమాలో ఓ నేపధ్య గీతం ఉంది . ఈ పాట  అయితే బాగుంటుందని మా ఇద్దరికీ అనిపించింది .  వేటూరి గారి ఇంటికి వెళ్లి పాట సన్నివేశం వివరించాము . వారం రోజుల తరువాత పాట  సిద్ధమైంది . వేటూరి వారి ఇంటికి  పాట  కోసం నేను వెళ్ళాను . ఆయన పాట రెడ...
Image
                             చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్  "ఆక్సిజన్ బ్యాంక్" మెగాస్టార్ చిరంజీవి . కరోనా లాంటి క్లిష్ట సమయంలో తాను ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీన్ని యుద్దప్రాతిపదికన పూర్తిచేయనున్నారు.  చిరంజీవి, ఆయన కుమారుడు   రామ్ చరణ్ ఎంతో కాలంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 1998లోనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి  తన సేవలకు శ్రీకారం చుట్టారు.  అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ రోగులకు అవసరమైన రక్తాన్నిఅందజేస్తూ వస్తోంది. ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఇటీవల కరోనా మరణాలు కూడా మెగాస్టార్ ను కదిలించాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆక్సిజన్ బ్యాంక్ స్థాపన ఆలోచన. తన ఆలోచనకు కుమారుడు రామ్ చరణ్ తోనూ పంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంత...
Image
                 నిర్మాత దర్శకుడు యు విశ్వేశ్వర రావు  ఇక లేరు  ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు విశ్వేశ్వర రావు ఈరోజు ఉదయం చెన్నై లో మరణించారు .  విశ్వేశ్వర రావు గారి వయసు 92 సంవత్సరాలు . ఆయనకు ఇద్దరు అమ్మాయిలు , మంజు, శాంతి, కుమారుడు ధనుంజయ్ .  నిర్మాత దర్శకుడుగా విశ్వేశ్వర రావు గారు తెలుగు సినిమాకు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించారు .  నిరాడంబరుడు, నిగర్వి, ఉన్నదున్నట్టు మాట్లాడే స్వభావం కలిగినవాడు విశ్వేశ్వర రావు గారు .  విశ్వేశ్వర రావు గారితో నాకు 1979 నుంచి పరిచయం వుంది . 1980 జూన్ లో హైదరాబాద్ లో జరిగిన నా :"మానవత "కవితా సంపుటి  ఆవిష్కరణకు మహాకవి శ్రీ శ్రీ గారితో నా పుస్తకానికి ముందు మాట వ్రాయించడమే కాదు శ్రీశ్రీ గారిని ఈ పుస్తకావిష్కరణ సభకు హైదరాబాద్ తీసుక వచ్చారు . ఈ సభలో విశ్వేశ్వర రావు గారు ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు .  ఆ నాడు విశ్వేశ్వర రావు గారు చేసిన ఈ సహాయం జీవితాంతం మర్చిపోలేదిది .  విశ్వేశ్వర రావు గారు మహానటుడు, నాయకుడు ఎన్ .టి రామారావు గారికి బావమరిది . ఆ తరువాత తన కుమార్తె శాంతిని ...
Image
                      పావల శ్యామల జీవితానికి ఆర్థిక  భరోసా కల్పించిన                                              మెగాస్టార్ చిరంజీవి  Megastar Chiranjeevi Financially Supported the life of actress Pavala Shyamala. Yesterday.he sent Rs 1,01,500 cheque for Maa membership. MAA will give every month Rs 6000/- as pension to Shyamala .
Image
                              నేడు శ్రీమతి శాంతకుమారి జయంతి  నటి, గాయని శ్రీమతి శాంతకుమారి జయంతి   నేడు. శ్రీమతి శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 17 మే 1920లో కడప జిల్లా రాజుపాలెంలో శ్రీనివాసరావు , పెద్ద నరసమ్మ దంపతులకు జన్మించింది . ఆమె తండ్రి నటుడు ,తల్లి శాస్త్రీయ సంగీత గాయకురాలు . తల్లి తండ్రి వారసత్వంతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. 1936లో నిర్మించిన "శశిరేఖా పరిణయం" ఆమె తొలి చిత్రం . అదే సంవత్సరం పి .పుల్లయ్య దర్శకత్వం వహించిన "సారంగధర " సినిమాలో  నటించింది. ఆమె తన పేరును శాంతకుమారి గా మార్చుకుంది . ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పుల్లయ్య , శాంత కుమారి ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు . 1947లో తన మిత్రుడు భీమవరపు నరసింహారావుతో రాగిణి పిక్చర్స్ అన్న సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలు నిర్మించారు .  పుల్లయ్య , శాంతకుమారి ఇద్దరు ఆడపిల్లలు . పెద్దమ్మాయి పేరు పద్మ . ఆమె పేరుతో పద్మశ్రీ సంస్థను ప్రారంభించి జయభేరి ,శ్రీవెంకటేశ్వర మహత్స్యం ,ప్రేమించి చూడు లాంటి ఎన్నో చిత్రాలు నిర...
Image
               ఈరోజు గాయని జమునారాణి జన్మదినోత్సవం  తెలుగు, తమిళ ,మలయాళ ,కన్నడ  హిందీ ,సింహళ భాషల్లో 6000 పైగా వైవిధ్యమైన పాటలు ఎన్నో పాడిన జమునా రాణి 17 మే 1938లో జన్మించారు .జమునారాణి తన ఎనిమిదవ ఏట "త్యాగయ్య " సినిమాలో తొలిసారి పాడారు . 2012లో ఆమె "మిథునం " సినిమాలో పాడిన తరువాత మళ్ళీ పాడలేదు .  శ్రీమతి జమునారాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
Image
                     36 సంవత్సరాల నాటి స్మృతి చిత్రమ్   పంపిణీదారు , నిర్మాత  యలమంచి హరికృష్ణ సినిమా పట్ల అవగాహన , అభిరుచి తో పాటు సామాజిక బాధ్యత వున్న వ్యక్తి .  కృష్ణ చిత్ర పతాకంపై వై . అనిల్ బాబు నిర్మాతగా తాను  సమర్పకుడిగా టి . కృష్ణ దర్వకత్వంలో రూపొందించిన చిత్రం "వందేమాతరం ". ఈ సినిమాలో రాజశేఖర్ , విజయ శాంతి జంటగా నటించారు. "వందేమాతరం ". సినిమా విడుదలైన సందర్భగా హైదరాబాద్ లోని హోటల్ రిట్జ్ లో చిత్రం గురించి మాట్లాడటానికి ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు . అప్పట్లో నేను హైద్రాబాద్ లో జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా ఉండేవాడిని. సికిందరాబాద్ లోని  రాష్ట్రపతి రోడ్డులో సినిమా పంపిణీ సంస్థలు ఉండేవి. అందరూ నన్ను బాగా అభిమానించేవారు. నేను తరచుగా వారిని కలుస్తూ వార్తలు రాస్తూ ఉండేవాడిని .  అప్పట్లో సినిమా విడుదల తరువాత హైద్రాబాద్ లో ఆ సినిమా గురించి తప్పకుండా సమావేశం ఏర్పాటుచేసేవారు . ఇందులో జర్నలిస్టులు, రచయితలు , రచయిత్రులు, కవులను ఆహ్వానించేవారు . ఇలా రచయితలను పిలవాలనుకున్నప్పుడు నన్ను సంప్రదించే...
Image
                            కరోనా కాటేస్తోంది  ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు  ఎన్ని మరణ వార్హలు  ఎన్నెన్ని కన్నీటి కథలు  పాలకుల అలసత్వం  కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహం  మానవత్వం లేని మృగాలు సంచరిస్తున్నాయి .  అకాల మరణాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి  అంతా అగమ్యం ..  కరోనా కలత పెడుతోంది  కరోనా కన్నీరు పెట్టిస్తుంది  మానవ జాతికిది పెను ప్రమాదం  ఆజాగ్రత్తే మనకు శిక్ష   మన ఇల్లే మనకు రక్ష 
Image
                దర్శకరత్న దాసరి 74వ జయంతి ఈరోజు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు గారి 74వ జయంతి.  ఆయన వున్న రోజుల్లో మే 4 సినిమా రంగంలో ఓ పండుగ రోజు . ఉదయం నుంచి  రాత్రి వరకు దాసరి గారి ఇల్లు అభిమానులు, ఆత్మీయులు , నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు , రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేది . ఆ వైభవం, ఆ ప్రాభవం ... ఆయనతోనే పోయాయి.   దాసరి నారాయణ రావు గారు.  తెలుగు సినిమాను శ్వాసించి, శాసించిన  గొప్ప దర్శకుడు  .  సినిమా రంగంలో అతి చిన్న స్థాయి నుంచి ఊహించని స్థాయికి ఎదిగి ఒదిగిన సృజనాత్మక దర్శకుడు దాసరి .  రచయితగా , దర్శకుడుగా , నటుడుగా , నిర్మాతగా , పాటల రచయితగా, పత్రికాధిపతిగా , కేంద్ర మంత్రిగా  బహుముఖాలుగా ఎదిగిన అసమాన్యుడు దాసరి .  దాసరి కేవలం తన ఎదుగుదలనే కాదు సినిమా రంగ అభివృద్ధికి కూడా దోహదపడిన వ్యక్తి .  తెలుగు సినిమా రంగంలో అందరూ ఆప్యాయంగా మేస్త్రీ అని ఆప్యాయంగా పిలుస్తారు . నిజంగానే సినిమాకు ఆయన సారధ్యము వహించిన మేస్త్రీ.  దాసరి నారాయణ రావు గారు ఆదర...
Image
                             మే 3, 2017 నాటి మధుర స్మృతి  2016 సంవత్సరపు జాతీయ అవార్డులను మే 3వ తేదీన అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు  ప్రదానం చేశారు . అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రదానోత్సవం వైభవంగా జరిగింది . జాతీయ అవార్డుల కమిటీ సభ్యుడుగా అశోక హోటల్లో 23 రోజులపాటు సూట్ రూమ్ కేటాయించారు. చైర్మన్ కు మాత్రమే ఇలాంటి సూట్ రూమ్ ఇస్తారు. నేను సభ్యుడును మాత్రమే , అయినా నాకు సూట్ కేటాయించారు.   న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మే 3వ తేదీ సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో నాతో పాటు నా భార్య ఝాన్సీ రాణి పాల్గొన్నది . .  రాష్ట్రపతి అవార్డుల ప్రదానం చెయ్యడానికి ముందు వెంకయ్య నాయుడు గారు ఓ సమావేశ ఏర్పాటు చేసి జ్యూరీ సభ్యులందరికీ సరిఫికేట్లను ప్రదానం చేసి అభినందించారు . ఆ తరువాత జ్యూరీ సభ్యులకు హై టీ కూడా ఏర్పాటు చేశారు . జ్యూరీ సభ్యులకు ఇలా సర్టిఫికెట్స్ ఇవ్వడం అనే సంప్రదాయానికి వెంకయ్య నాయుడు గారు శ్రీకారం చుట్టారు . రాష్ట్రపతి పాల్గొన్న జ...