పోస్ట్‌లు

చిత్రం
  ఆత్మీయ అతిధిగా  గత నెల 29న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు రామ మూర్తి పంతులు ఫౌండేషన్, శంకరం ఫౌండేషన్ సంయుక్తంగా గిడుగు జాతీయ పురస్కారాలప్రదానోత్సవాన్ని  నిర్వహించారు . మీర్జాపురంరాణి కృష్ణవేణి పుస్తకాన్ని ప్రచురించిన  నిర్మాత ఎన్ .ఆర్. అనురాధా దేవి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నటి, నిర్మాత , గాయకురాలు శ్రీమతి కృష్ణవేణి కుమార్తె అనురాధాదేవి. శ్రీమతి కృష్ణవేణి 1949లో 'మనదేశం 'సినిమాలో నందమూరి తారకరామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేశారు , ఆ సినిమాకు తన సహాయం ఉండదని రాజావారు చెప్పారు. అయినా సరే మహాత్మా గాంధీ గారి స్పూర్తితో దేశ భక్తి  సినిమాను కృష్ణవేణి గారు రూపొందించారు. శోభనచల బేనర్ లేకుండా తన కుమార్తె అనురాధాదేవి పేరుతో ఎమ్ .ఆర్ .ఏ (మేకా రాజ్యలక్ష్మి అనురాధ ) బేనర్ ఏర్పాటుచేసి 'మనదేశం 'చిత్రాన్ని నిర్మించారు.  ఆ విధంగా ఎన్ .టి .ఆర్ . తొలి సినిమాతో అనురాధాదేవి గారికి వున్న అనుబంధనాన్ని ఆత్మీయ అతిధిగా పాల్గొన్న నేను ఈ సభలో  వివరించడం జరిగింది . 
చిత్రం
  విలక్షణ నటుడు నటుడు నారాయణ రావు  నటుడు, నిర్మాత జి .వి. నారాయణరావు బుధవారం సాయంత్రం మృతి చెందారు.  1973లో నారాయణ రావు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ పొందారు.  అదే ఇనిస్టిట్యూట్ లో రజనీకాంత్, చిరంజీవి కూడా శిక్షణ పొందారు . వారిద్దరితో  నారాయణ రావు కు స్నేహం వుంది . 1976లో దర్శకుడు కె .బాలచందర్ 'అంతులేని కథ ' తెలుగు చిత్రంలోనారాయణరావును  సినిమారంగానికి పరిచయం చేశాడు . ఆ సినిమాలో 'తాళికట్టు శుభ వేళ .. మెడలో కళ్యాణ మాల ' అనే పాటలో నారాయణ రావు చూపించిన అభినయం ఆయన్ని ప్రభిభావంతుడైన నటుడుగా నిలబెట్టింది . ఆ సినిమాలో ఉత్తమ సహాయ నటుడుగా నారాయణరావు ను ఎంపిక చేసి  ప్రభుత్వం నంది అవార్డును ప్రదానం  చేసింది.  అదే సంవత్సరం నిర్మాత ఎమ్మెస్ రెడ్డి బి .వి .ప్రసాద్ దర్శకత్వంలో  రూపొందించిన 'ముత్యాల పల్లకి ' చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు . ఇందులో జయసుధ కథానాయిక.   ఆ తరువాత సంవత్సరం 1977లో దర్శకుడు మృణాల్ సేన్ తెలుగులో నిర్మించిన 'ఒక ఊరి కథ ' సినిమాలో ముఖ్యమైన  పాత్రకు ఎంపిక చేశారు . ఏ .పరంధామ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో...
చిత్రం
  ఆంగికం, ఆహార్యం, అభినయం, వాచకం షావుకారు జానకి పెట్టని ఆభరణాలు  తెలుగు సినిమా రంగంలో షావుకారు జానకిది  అద్వితీయమైన స్థానం. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా సినిమా రంగంలో ప్రవేశించినా, కట్టుకున్నవాడు స్వార్ధపరుడుగా మారిపోయాడని తెలిసి, ముగ్గురు పిల్ల తరువాత వివాహ బంధాన్ని రద్దు చేసుకొని, ఒంటరి మహిళగా , ధీరోదాత్త నటిగా జీవనం సాగించి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు .  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి,  సినిమా రంగంలో ఎవరి  సహకారం , ప్రోత్సాహం లేకుండా  స్వయంగా ఎదిగి , ఒదిగిన మహానటి. 1950లో 'షావుకారు' చిత్రం తో మొదలైన ఆమె నట ప్రస్థానం 2023లో  విడుదలైన 'అన్నీ మంచి శకునములే ' చిత్రం వరకు కొనసాగింది. ఈ ఏడు దశాబ్దాలలో ఆమె ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ లాంటి మహానటులతో నటించారు. చిన్నప్పుడు మహాత్మా గాంధీ మద్రాసు వచ్చినప్పుడు వారికి పాలు, వేరుశనగ పప్పులు అందించి ఆశీస్సులు అందుకున్న జానకి ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరా గాంధీ లాంటి నేతలతో మాట్లాడిన అదృ...
చిత్రం
  మంచితనం, మనిషితనం మూర్తీభవించిన గుమ్మడి  శత జయంతి  వేడుకలు ప్రారంభము  తెలుగు సినిమా రంగములో తనదైన ముద్ర వేసిన మానవతావాది, నిరాడంబరుడు , నిగర్వి, నిబద్ధతకాల మహా నటుడు గుమ్మడి వెనకటేశ్వర రావు. పాత్రోచితమైన నటనకు, సంభాషణలకు  ఆయన మారు పేరు.  మన సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చే వ్యక్తిగా, సినిమా రంగంలో ఉంటూ కూడా  ఆ గ్లామర్ ముసుగు లేకుండా చివరివరకు మానవతా విలువలతో  జీవన  ప్రస్థానం సాగించిన అరుదైన, అపూర్వమైన నటుడు గుమ్మడి వేంకటేశ్వర రావు.  సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధిచెందిన  వెంకటేశ్వరరావు జూలై 9, 1927న  గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని  రావికంపాడు గ్రామంలో  గుమ్మడి  బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. గుమ్మడికి  ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెలు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం.  ఆ కుటుంబ  వాతావరణంలో పెరగడం వల్ల మనుషుల మధ్య మమతానురాగాలు  ఏమిటో చిన్నప్పుడే చవి చూశారు.  ప్రాధమిక విద్యను రావికంపాడులో  ఉన్నత విద్యను కొల్లూరులో చదివారు. ఈ దశలోనే  పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వర ...
చిత్రం
  సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ ? ఈ వార్త ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. దాదా సాహెబ్ ఫాల్కే , పద్మవిభూషణ్  రజినీకాంత కేవలం తమిళనాటికే పరిమితం అయిన నటుడు కాదు , తెలుగు , తమిళ , కన్నడ, మలయాళం , బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగారు .   రజనీకాంత్  తన ఆత్మకథను రాస్తున్నారని వార్త ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఆసక్తిని కలిగిస్తుంది.  రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.  మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. మరాఠాల   చక్రవర్తి ఛత్రపతి శివాజీ అంటే ఆయన తల్లిదండ్రులకు ఇష్టం .అందుకే  ఆయనకు ఆ పేరు పెట్టారు.   రజినీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ . ఆయన పోలీస్ కానిస్టేబుల్. వీరు మహారాష్ట్ర, పుణె సమీపంలోని మావడి కడెపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. రజినీకాంత్ చిన్నవాడు. తండ్రి  రామోజీరావు పదవీ విరమణ చేసిన తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది.  రజనీకాంత్ బస్ కండక్టర్‌గా జీవితాన్ని మొదలు పెట్టా...
చిత్రం
  దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి.  ఈరోజుమహాకవి దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి.   ఉర్దూలో మెట్రిక్యులేషను, తరువాత భోపాల్ విశ్వవిద్యాలయంలో  ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో  ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు.  తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం చెప్పడంలో  ప్రావీణ్యం సంపాదించాడు..   ఆశువుగా కవితలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు .  చదువుకునే రోజుల నుంచే బానిసత్వాన్ని నిరసించేవాడు . నిజాం పాలనకు వ్యతిరేకంగా కలం తో నినదించారు .  ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాస్తున్నడని 1947లో ఆయన్ని జైలులో పెట్టారు .  అయినా  నిజాం అరాచకాలను ఖండిస్తూ జైలు గోడల మీద కవితలు వ్రాస్తూనే వున్నారు . "ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ!"  అని నిజాముపై నిప్పులు కురిపించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య .  అలాగే తెలుగు గురించి ... "ఎవరు కాకతి! ఎవరు రుద్రమ! ఎవరు రాయలు! ఎవరు సింగన! అంతా నేనే! అన్నీ నేనే! అలుగు నేనే...
చిత్రం
  నేపధ్య గాయని, ఎస్ .జానకి ఇక లేరు .  ఆమె తన 88వ ఏట జులై 11న ఇహలోక యాత్ర ముగించారు .  భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో  గాన కోకిల ఎస్. జానకి గారిది అద్వితీయమైన స్తానం . ఆమె  తన మధుర గాత్రంతో ఐదు దశాబ్దాలకు భారతీయ  శ్రోతలను అలరించిన మధుర  నేపధ్య గాయని.  ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో రేపల్లెలో వాళ్లపట్ల గ్రామంలో  జన్మించారు. ఆమెకు ఎటువంటి సాంప్రదాయ సంగీతంలో అధికారిక శిక్షణ లేకపోయినప్పటికీ, నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం  నేర్చుకున్నారు .  1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు   'విధియిన్‌ విలాయత్తు' అనే చిత్రం ద్వారా చిత్ర రంగంలో పరిచయం చేశారు .  తెలుగులో ఆమె మొదటి చిత్రం  'ఎమ్మెల్యే. నిర్మాత కె .బి .తిలక్ రూపొందించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు , ఈ సినిమాలో 'నీ ఆశా అడియాశా .. చెయి జారే మణిపూస..  బ్రతుకంతా అమవాసా ...లంబాడోళ్ళ రాందాసా' అనే పాటను ఘంటసాలతో కలసి పాడారు . ఈ గీతాన్ని  ఆరుద్ర వ్రాశారు .  తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ప...
చిత్రం
 "ఎన్ .టి .ఆర్ . తరతరాలకు స్ఫూర్తి ప్రదాత"  - వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్న ఎన్ .టి . రామారావు తెలుగు జాతికి స్ఫూర్థి ప్రదాత, తరతరాలు ఆయన భావజాలం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయశాఖా  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.  ఎన్ .టి .ఆర్ఆ. లిటరేచర్ కమిటీ నాలుగు  సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ లో శనివారంనాడు జరిగిన సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- తాను రామారావుగారి అభిమానంతో, ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగానని ఆయన వ్యక్తిత్వం, ఔనత్యం చాలాగొప్పదని. బడుగు, బలహీనవర్గాలతోపాటు వెనుకబడిన ప్రజలకు కూడా రాజకీయంగా చేయూతనిచ్చిన మహానాయకుడు రామారావుగారని ఆయన చెప్పారు .  ఎన్టీఆర్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయటానికి టి.డి. జనార్థన్ నాయకత్వంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటుకావటం ఎంతో సముచితంగా ఉందని, ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ స్ఫూర్తినిస్తూంటుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ మాజీ శాసనసభాదిపతి ఎమ్. మధుసూధనాచారి మాట్లాడుతూ- రాజ్యాధికారం లేని ఎన్నో కులాలను గుర్తించి వారిక...
చిత్రం
  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న  డాక్టర్ వై .ఎస్ .ఆర్ .  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత సమున్నతమైనదో, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో  ఈ సంఘటన తెలియజేస్తుంది .  2004లో మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేశారు . అప్పుడు వారు  సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార  కార్యక్రమాలను నిర్వహించేవారు.  1978లో ఫిలిం నగర్ కు అంకురార్పణ జరిగింది. 1984- 85 వరకు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్లో సంపూర్ణంగా స్థిరపడింది.  నిర్మాత, దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గా 2004 జులై 14న  'ఫిలిం నగర్ దైవ సన్నిధానం '  పేరుతో  దేవాలయం ప్రారంభమైంది.  అక్టోబర్ మొదటి వారంలో ఈ దేవాలయ సందర్శనకు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి  రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను. మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్...
చిత్రం
 డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి.  2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేసిన తర్వాత,   సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార  కార్యక్రమాలను నిర్వహించారు. నిర్మాత , దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు  2004లో 'ఫిలిం నగర్ దైవ సన్నిధానం '  పేరుతో ఒక దేవాలయాన్ని ఫిలిం నగర్ లో నిర్మించారు. ఈ దేవాలయానికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అక్టోబర్ మొదటి వారంలో రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను . మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్టర్ కె .వి. రమణాచారి మాకు సమయం ఇప్పించారు . ఆరోజు ఉదయం మేము లేక్ వ్యూ కు వెళ్ళాము . రాజశేఖర్ రెడ్డి గారి కోసం హాల్ లో చాలా మంది వేచి వున్నారు .  సరిగ్గా 9.30 గంటలకు మేమున్న హాల్ లోకి  రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు . అందరినీ కలసి మాట్లాడి పంపించిన తరువాత మా దగ్గరకు వచ్...
చిత్రం
  జన్మదిన శుభాకాంక్షలు  భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి 77వ జన్మదిన శుభాకాంక్షలు . మీరు ఇలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 
చిత్రం
  పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రధాని అభినందనలు   పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్ లో అత్యంత వైభవంగా జరిగింది . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను ప్రదానం  చేశారు . ఇందులో ఇద్దరు పద్మ విభూషణ్ , ఏడుగురు పద్మ భూషణ్ , 56మంది పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు .  న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ , ప్రధాని నరేంద్ర మోడీ , లోక సభాపతి ఓం బిర్లా , మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ , హోమ్ మంత్రి అమిత్ షా , విమాన శాఖా మంత్రి కె .రామ మోహన్ నాయుడు , కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు . ఈసారి పద్మశ్రీ పురస్కారాన్ని నటులు మాగంటి మురళీ మోహన్ , గద్దె రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. సినిమా రంగంలో వీరు సాధించిన విజయానికి ఈ అవార్డు లభించింది .  2026 పద్మ పురస్కార గ్రహీతల జీవితం ఎంతో  స్ఫూర్తిదాయకమని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.  జూన్ 23న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ అందరినీ  అభినందించారు .  రాష్...
చిత్రం
  అభ్యుదయ దర్శకుడు, అసమాన దార్శనికుడు   గూడవల్లి రామబ్రహ్మం   తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామ బ్రహ్మం గారిది  ఓ సంచలన అధ్యాయం.  సినిమా కేవలం వినడా సాధనం మాత్రమే కాదు, దీని ద్వారా సామాజిక ప్రయోజనం సాధించవచ్చునని నిరూపించిన అభ్యుదయ దర్శకుడు రామ బ్రహ్మం. ఆయన మొదట జర్నలిస్ట్ , ఆ తరువాత సినిమా దర్శకుడు.  ఈ రెండు మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను  చేయాలని నిరంతరం కృషి చేసిన అభ్యుదయ మూర్తి , చైతన్య స్ఫూర్తి రామ బ్రహ్మం. ఆయన   జూన్ 24, 1898 న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలము నందమూరు గ్రామంలో గూడవల్లి వెంకయ్య, బాపమ్మలకు  జన్మించాడు.  ఆయన చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరులలో సాగింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేవాడు .  18 ఏళ్ళ వయసులో  కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో రామ బ్రహ్మానికి వివాహం జరిగింది.మామ గారి ఇంట్లో  కొన్నాళ్ళు ఉండి గాంధీ గారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. 1924లో విజయవాడలో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక గడియారాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే అక్కడ వ్యాపారం స్నేహితులతో , రాజకీయ ...
చిత్రం
సావేరి 'నిష్ఫల ప్రేమ'.     మేల్ ప్రాస్టిట్యూషన్ గురించి తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలలు చాలా అరుదు. ఈ నేపథ్యంతో నవల రాయడం సాహసమే. ఇటువంటి సాహసాన్నిసీనియర్  జర్నలిస్ట్ మరియు రచయిత అయిన భగీరథ గారు తన రెండో నవల  ‘సావేరి’ ద్వారా చేశారు. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. 2010 లో నవలగా వెలువడింది. ఈ సంస్కృతి గురించి అప్పట్లో దిన పత్రికలో వచ్చిన ఓ వార్త ఆధారంగా ఈ నవలను రాసినట్టు రచయిత తన ముందుమాటలో పేర్కొన్నారు. అలాగే ఈ సావేరి కథను సినిమాగా తీయాలని నటి జయసుధ గారు అనుకున్నప్పటికి అది సాధ్యపడలేదని కూడా రాశారు.  కలకత్తా వేదికగా ఈ కథ జరిగినా, ఈ కథ ద్వారా మనసులు మలీనం కానంతవరకు శరీరాలు కావు అని చెప్పే ప్రయత్నం చేసినా ఆ సూత్రం ఒక్క శ్రీరాజ్ పాత్రకు మాత్రమే వర్తించి, గీతాంజలి పాత్రకు అంతగా వర్తించలేదేమో అనిపిస్తుంది.  శ్రీరాజ్ అనే యువకుడు అమెరికాలో  విద్య పూర్తి చేసుకుని  హైదరాబాద్ లో స్థిరపడతాడు. ఒక  ఎలక్ట్రానిక్ కంపెనీలో  సాంకేతిక సలహాదారుడుగా  నియమితులవుతాడు. ఆ సందర్భంగా పరిచయాలు పెంచుకొవడానికి  స్టార్ హోటల్ లో  ఓ పార్...
చిత్రం
  రాజబాబు 69 జయంతి  మిత్రుడు బొడ్డు  రాజుబాబు 69వ స్మారక  అవార్డుల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో  జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ వ్యక్తులను ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించాము .  రాజ బాబు మిత్ర బృందం కాకాని బ్రహ్మం , నాగేశ్వర రావు ,నర్రా  వెంకట రావు , బాలాజీ, కుమార్ , కుటుంబ సభ్యులు రమేష్,వీరన్న తో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను .  రాజబాబు స్మారక అవార్డులను మా ఎన్ .టి .ఆర్ . కమిటీ చైర్మన్ ,టి డి .జనార్దన్ , దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి,నటులు  ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్,  కోట శంకర రావు, సీనియర్ జర్నలిస్ట్ భావన్నారాయణ , నటీ గీతా భాస్కర్, విద్యావేత్త మేఘన ముసునూరి, నటుడు శశాంక్ స్వీకరించారు  .  ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు , దర్శకులు బి .గోపాల్, వీర శంకర్, ఎస్ .పి .నాగేశ్వర రావు, చుక్కా కొండయ్య, కోటి రెడ్డి , మల్లికార్జున్   తదితరులు పాల్గొన్నారు .
చిత్రం
  భగీరథ "నాగలాదేవి" చరిత్రకు వీరతిలకం  నాగలాదేవి , శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ.  నేను రచించిన చారిత్రాత్మక నవల. అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముందుమాట వ్రాశారు . అప్పటి ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఆవిష్కరించారు .  ఈ నవలను బళ్లారిలోని పాఠ్య గ్రంథంగా ఉంది . శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉంది . హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నా సాహిత్యంపై పరిశోధన జరుగుతుంది . బళ్లారిలో డాక్టర్ ఆర్ .దేవన్న 'నాగలాదేవి ' నవలను కన్నడంలోకి అనువదిస్తున్నారు . చీరాల మిత్రుడు డాక్టర్ బీరం సుందర్ రావు గారు "నాగలా దేవి" పుస్తకం గురించి రాసిన అద్భుతమైన సమీక్ష, మీ కోసం ...! ఒక కథనో, నవలనో, పుస్తకాన్నో చదివాక హర్షం వర్షమై గుండెను తడపాలి. చదివిన ప్రతి ఘట్టంలోనో , సన్నివేశంలోనో తీయని అనుభూతి మనల్ని వెంటాడాలి .  దృశ్యం వెంట దృశ్యం మనల్ని వేగంగా నడిపించుకుంటూ కథ వెంట పరుగు తీయించాలి . చరిత్ర పొరల్లో దాగిన రసమయ గాథను చదువుతుంటే మనసు నవరసభరితమై, ఆనంద తాండవం చేయాలి .  భాష, భావం కలగలిపి, వర్ణనలతో జతకలసి, కల్పన...