
ఈ రోజు నా పుట్టినరోజు మే డే . ప్రపంచ కార్మికుల దినోత్సవం. కార్మికులంతా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే నేను మాత్రం పుట్టినరోజు పండుగలు ఎప్పుడూ చేసుకోలేదు. ఆత్మీయులు మాత్రం ప్రతి సంవత్సరం గ్రీట్ చేస్తుంటారు . ఈ సందర్భగా ఓ చిన్న జ్ఞాపకం. 1983 మే 1 వ తేదీన అంటే 38 సంవత్సరాల క్రితం నేను చిక్కడపల్లి లో ఉండేవాడిని. ఆరోజు జ్యోతి చిత్రవార పత్రిక ప్రెస్ మీట్ కు వెళ్లి వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్ జి భరత్ భూషణ్ కు ఈ విషయం చెప్పాను . నాకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన భరత్ ఇంటికి వచ్చి నా ఫోటోలు తీశాడు . మీరు చూస్తున్న ఫోటోలు అప్పటివే. . 1983 జనవరి 9న అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు దేశం పార్టీని స్థాపించి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు . ఆ తరువాత జ్యోతి చిత్ర వార పత్రికకు ముఖ్యమంత్రి రామారావు గారిని ఇంటర్వ్యూ చేశాను. అనుకోకుండా నా బర్త్ డే రోజున రామారావు గారి కవర్ ఫోటో తో జ్యో...